Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rajni is friend to my dad

ఈ సంచికలో >> సినిమా >>

‘సుబ్రహ్మణ్యం’ను డిసైడ్‌ చేసిన హరీష్‌

harish decided subrahmanyam

సినిమాల్లో పాత్రలను, వాటి స్వభావాలను తయారు చేయడం దర్శకుడికి కత్తిమీద సాము. పాత్రలను ఎలా డిజైన్‌ చేశాడన్నదానిపైన కూడా సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. హీరో పాత్రని పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేయడంలో అందెవేసిన చెయ్యి దర్శకుడు హరీష్‌ శంకర్‌ది. అందుకే అతనికి పవన్‌కళ్యాణ్‌ పిలిచి ‘గబ్బర్‌సింగ్‌’ అవకాశమిచ్చాడు.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ హీరోగా నటిస్తున్నాడు. సినిమా ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్‌ హాజరై, సినిమా యూనిట్‌కి బెస్ట్‌ విషెస్‌ తెలిపాడు. చాలా రోజుల క్రితం ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ ప్లాట్‌ని సిద్ధం చేసుకున్నట్లు సినిమా ప్రారంభోత్సవ వేదికపై హరీష్‌ శంకర్‌ చెప్పాడు.

‘రేయ్‌’ ట్రైలర్స్‌, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా చూసిన తర్వాత సాయిధరమ్‌ తేజ్‌పై ఓ ఐడియా వచ్చిందని, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో మాస్‌, ఫ్యామిలీ మెచ్చేలా అతని క్యారెక్టర్‌ని ప్రత్యేకంగా డిజైన్‌ చేశానని అంటున్న హరీష్‌ శంకర్‌, తేజని హీరోగా నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్ళేలా సినిమా ఉంటుందన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్‌ హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్న హరీష్‌ శంకర్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam