Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
first compliment from chiru sir-adi

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - యమలీల 2

movie review - Yamaleela2

చిత్రం: యమలీల 2
తారాగణం: డా. సతీష్‌, దియా నికోలస్‌, మోహన్‌బాబు, బ్రహ్మానందం, షయాజీ షిండే, ఆశిష్‌ ఇద్యార్థి, కోట, ఎం.ఎస్‌. నారాయణ, రావు రమేస్‌, సదా, నిషా కొఠారి తదితరులు
చాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజి
సంగీతం: ఎస్‌.వి. కృష్ణారెడ్డి
నిర్మాణం: క్రిష్వి ఫిలింస్‌
దర్శకత్వం: ఎస్‌.వి. కృష్ణారెడ్డి
నిర్మాత: డా. సతీష్‌, అచ్చిరెడ్డి
విడుదల తేదీ: 28 నవంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే
యముడు (మోహన్‌బాబు) మానస సరోవరానికి విహారం కోసం వెళతాడు. యముడ్ని వెతిక్కుంటూ వెళ్ళే క్రమంలో చిత్రగుప్తుడు, క్రిష్‌ (సతీష్‌) అనే ఓ డాక్టర్‌ని కలుస్తాడు. చిత్రగుప్తుడు, క్రిష్‌కి భవిష్యవాణిని ఇచ్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తెరిచి చూడవద్దని, తాను తిరిగి వచ్చాక, తనకు ఆ భవిష్యవాణిని ఇచ్చేయాలని కోరతాడు. అయితే ఉత్సుకత ఆపుకోలేక, భవిష్యవాణిని తెరుస్తాడు క్రిష్‌. ఆ భవిష్యవాణిలో క్రిష్‌ ఏం చూస్తాడు? తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నవి తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
నటనలో చాలా నేర్చుకోవాల్సి ఉంది హీరో సతీష్‌కి. డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌, డాన్స్‌లు, ఫైట్స్‌ అన్ని విషయాల్లోనూ చాలా ఇంప్రూవ్‌మెంట్‌ అవసరం. ప్రత్యేక శిక్షణ తీసుకుంటే అది కష్టమైన విషయం కాదు. దియా నికోలస్‌ క్యూట్‌గా ఉంది. తన పాత్ర వరకూ బాగానే చేసింది.

మోహన్‌బాబు యముడిగా ఆకట్టుకుంటారు. చిత్రగుప్తుడి పాత్రలో బ్రహ్మానందం నవ్వులు పూయించారు. ఆశిష్‌ విద్యార్థి ఎంటర్‌టైనింగ్‌ పాత్రలో కనిపించగా, షయాజీ షిండే నటన పరంగా తన స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా చేశాడు. కోట, తదితరులంతా తమ పాత్రల పరిధి మేర నటించారు.
యముడి సినిమాలంటే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. అలాంటి లైన్‌ ఎంచుకున్న దర్శకుడు, రిచ్‌గా సినిమాని ప్రెజెంట్‌ చేయగలిగినా, నేరేషన్‌లో తడబడ్డాడు. స్క్రిప్ట్‌ సాధారణంగా వుంది. స్క్రీన్‌ప్లే కూడా అంతంతమాత్రంగానే వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. రెండు పాటలు చూడ్డానికి బావున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌ సన్నివేశాలకు, బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్‌ ఓకే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా ఓకే. గ్రాఫిక్స్‌ ఫ్యాబ్యులస్‌గా ఉంది.

అలీ హీరోగా వచ్చిన ‘యమలీల’ అప్పట్లో పెద్ద హిట్‌. దానికి కొనసాగింపు అన్నట్లుగా ‘యమలీల2’ ప్రచారం జరుపుకుంది. అలీ ‘యమలీల’లో మదర్‌ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయ్యింది. ఈ ‘యమలీల`2’లో చైల్డ్‌ సెంటిమెంట్‌ ఉంది. అలీ సినిమాలో హీరో సామాన్యుడు. ఓ సందర్భంలో బ్రూస్‌లీ ఆత్మ హీరోలో ప్రవేశిస్తుంది. అది కన్విన్సింగ్‌గా అనిపించింది. ఇందులో యముడి శక్తులు హీరోకి వస్తాయిగానీ, దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. అంచనాల్లేకుండా వచ్చిన ‘యమలీల’కు అన్నీ కుదిరాయి. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం ఈ సినిమాపై హైప్‌కి కారణమయ్యాయి.

‘యమలీల’తో పోల్చితే, ‘యమలీల`2’లో విజువల్‌గా బాగోవడం తప్ప, ఇతర అంశాలేవీ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బారీ బడ్జెట్‌తో తీసిన సాధారణ సినిమా కావడంతో కమర్షియల్‌ విజయం కొంచెం కష్టమే.

ఒక్క మాటలో చెప్పాలంటే: నిరాశపర్చిన సీక్వెల్‌
అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka