Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం ( డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 11 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈ వారం మొత్తంమీద మాటలను పొదుపుగా వాడుట అనేది సూచన. తలపెట్టిన పనుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిఉండుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతస్తితికి అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. మిత్రులతో కలిసి చేసిన ఆలోచనలు ఆశించిన ఫలితాలను ఇచ్చినప్పటికి అనుకోని ఖర్చులకు దారితీసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. పెద్దలతో చర్చలు జరుగునపుడు నిదానంగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది సర్దుబాటు విధానం సర్వదా మేలు చేస్తుంది.

 

 

 

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచన. మీయొక్క మాటతీరు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది కాకపోతే వారిఆలోచనలను పరిగణలోకి తీసుకోవడం వలన కొంత మేర ఇబ్బందులను తగ్గించుకోవచ్చును. ఇష్టమైన వ్యక్తులనుండి వచ్చు సమాచారం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి, సంతానపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం.     

 

 

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కావున సాధ్యమైనంతవరకు యోగ,దైవపూజలకు సమయం ఇవ్వడం మేలు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం పెద్దల సూచనల మేరనడుచుకోండి. చేపట్టిన పనులలో చక్కటి ప్రణాళిక ఉన్నచో ఆశించిన ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు కావున ఈ విషయంలో సరైన ప్రయత్నం చేయుట మంచిది, నూతన పరిచయాలకు అవకాశం ఉంది అలాగే పెద్దలను కలుస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏమాత్రం అశ్రద్ధచేయకండి. వ్యాపారపరమైన విషయాల్లో కొంత సానుకూలఫలితాలు రావడం అనేది ఊరట. వాహనముల వలన ఇబ్బందులు లేక ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు.

 

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేపట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి మంచి ప్రశంశలు పొందుతారు నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన పనులను వేగవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. పెట్టుబడులకు సంభందించి కొంత ఆలోచించి ముందుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత వ్యతిరేకఫలితాలు రావడానికి ఆస్కారం కలదు జాగ్రత్త. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. కుటుంబంలో జీవితభాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. సోదరవర్గం నుండి కొంత పనిభారం తప్పకపోవచును.   

 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాని ఖర్చులపైన అదుపు అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. మీయొక్క మాటతీరు ఇతరులను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది కావున కొంత ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. కుటుంభంలో మాటపట్టింపులకు పోకండి అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వాహనముల విషయంలో ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం.

 

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది వారినిర్ణయాలను ఆంగికరించుట వలన మేలుజరుగుతుంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో మొండినిర్ణయాలు తీసుకొనేఅవకాశం ఉంది. కోపంను తగ్గించుకోవడం వలన వివాదాలు తగ్గుటకు అవకాశం కలదు నలుగురిని కలుపుకొని వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రతలు తీసుకోవడం అనెఇ సూచన. వ్యతిరేకవర్గం నుండి నూతన సమస్యలు కలుగుతాయి వాటిని దైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుండి నూతన విషయాలు తెల్సుకొనే అవకాశం ఉంది వారికి సమయం ఇస్తారు. విందులలో పాల్గొనే అవకాశం ఉన్దుఇ వాటికి ధనమును వెచ్చిస్తారు.

 

తులా రాశి

ఈ వారం మొత్తంమీద స్వల్పఆనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా నూతన సమస్యలు పొందుతారు. దైవసంబందమైన విషయాలకు సమయం ఇవ్వడం అనేది సూచన దానివలన మేలుజరుగుతుంది. శ్రమను కలిగి ఉంటారు సర్దుబాటు విధనం అలాగే  ఓపిక అవసరం. పెద్దలతో కలిసి నూతన సమస్యల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు కాకపోతే ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను పెద్దల సహాయసహకారాలతో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. సమయానికి ధనంసర్దుబాటు అవద్దం అనేది ఊరటను ఇస్తుంది. వినోదాలపట్ల మక్కువను కలిగి ఉంటారు.   

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబంలో వచ్చిన మార్పులు మీలో సంతోషాన్ని కలిగించేవిగా ఉండే అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు ఈ విషయంలో మాత్రం బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది సూచన. పెద్దలకు మీయొక్క విధానం కొంత భాధకు గురిచేసిదిగా ఉండే అవకాశం ఉంది ఈ విషయంలో మిమ్మల్ని మీరు సరిచుసుకోండి. నచ్చిన వ్యక్తుల నుండి నూతన సమాచరం అందుతుంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. స్త్రీ / పురుష ల నుండి సహకారం అందుతుంది సంతృప్తికరమైన ఫలితాలు పొన్దుఅత్కు అవకాశం ఉంది.   

 

 


ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ప్రయాణాలు అనుకూలమైన ఫలితాలను కలుగజేస్తాయి అలాగే నూతనపరిచయాలకు అవకాశం ఉంది వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. సామాజికసేవాకార్యక్రమాలకు సమయం సితారు మీ ఆలోచనలు నలుగురికి ఉపయోగపడేవిగా ఉండే అవకాశం ఉంది. మాటతీరు మార్చుకొనే ప్రయత్నం చేయుటకు అవకాశం ఉంది. కోపం మూలాన మిత్రులు భాధకు గురవుతారు. పనిఒత్తిడి పెరుగుటకు అవకాశం ఉంది సమయానికి భోజనం చేయుట సూచన. కుటుంబంలో సభ్యుల యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. దైవపూజలకు సమయం ఇవ్వండి మేలుజరుగుతుంది.   

 

 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద ఒకవార్త మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు. ప్రయాణాల మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు కొంత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. రాజకీయపరమైన విషయలకు సమయం ఇస్తారు పెద్దలతో చేపట్టిన చర్చలు అనుకూలమైన ఫలితాలు కలుగజేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో స్బహ్యులతో కలిసి పనిచేయుట వలన పనులు విజయవంతంగా పూర్తిఅవుతాయి. నూతన ప్రయత్నాల పట్ల మక్కువను కలిగి ఉంటరు. జీవితభాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి. గతకొంతకాలంగా పెండిగ్లో ఉన్న వాటిని పూర్తిచేస్తారు. మిత్రులయొక్క సహకారం అందుతుంది. సమయానికి ధనం అర్డుబాటు అవుతుంది.   

 

 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద ప్రయాణాలు చేయుట వలన కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చును. కుటుంబంలో ఊహించని మార్పులు కలుగుతాయి కొన్ని కొన్ని విషయాల్లో మార్పులు మీకు తెలువకుండానే జరుగుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి వచ్చు సూచనలను మీరు విబెదించే అవకాశం ఉంది. అశుభవార్తను వినే అవకాశం ఉంది మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో పెద్దల సూచనల మేరనడుచుకోండి. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రుల నుండి వచ్చు సమాచారం మీకు కోపాన్ని కలిగించే అవకాశం ఉంది. ఉత్సాహంను కలిగి ఉండి నూతన ప్రయత్నాలకు అవకాశంఇస్తారు మిత్రులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. దైవసమ్భ్నదమైన పూజలకు సమయం అలాగే ధనం వెచ్చిస్తారు.   

 

 


మీన రాశి
ఈ వారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం కలదు వారితో కలిసి సమయం ఇస్తారు. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మాత్రం పనిఒత్తిడి తప్పకపోవచ్చును ప్రణాళికా ప్రకారం నడుచుకోండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఒకవార్త మిమ్మల్నిఇబ్బందికి గురిచేస్తుంది సర్దుకుపోవడం అలాగే వేచిచూసే దొరని వలన మేలుచేస్తుంది. దూరప్రదేశం నుండి ఆశించిన సహాకారం లభిస్తుంది. 
శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
sahiteevnam