Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సుమంత్ అశ్విన్ తో ముఖాముఖి

interview with Sumanth Ashwin

'చక్కిలిగింత'పై బోలెడు కాన్ఫిడెన్స్

ఎమ్మెస్ రాజు గారి అబ్బాయి సుమంత్ అశ్విన్‌. ఆయ‌నేమో బ‌డా నిర్మాత‌. స్టార్ల‌తో పెద్ద పెద్ద సినిమాలు తీశారు. అయితే త‌న‌యుడు మాత్రం.... చిన్న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నాడు. ''ఈ వ‌య‌సులో నాకు ఎలాంటి క‌థ‌లు చేయాలో తెలుసు. అలాంటి క‌థ‌లే ఎంచుకొంటున్నా..'' అంటున్నాడు సుమంత్‌. అన్న‌ట్టు సుమంత్‌కి సినిమాల‌పై ఆస‌క్తి ఉండేది కాదు. కానీ.. ఆ త‌ర‌వాత మెల్లిగా ప్రేమ పెంచుకొన్నాడు.  తొలుత  ద‌ర్శ‌కుడ‌వ్వాల‌ని క‌ల‌గ‌న్నాడు. ఇప్పున‌డు హీరో అయ్యాడు.! తూనీగ తూనీగ‌, అంత‌కు ముందు ఆ త‌ర‌వాత‌, ల‌వ‌ర్స్.. అన్నీ బిలో ఏవ‌రేజ్ సినిమాలే. ఇప్పుడు ఓ హిట్టు కావాలి. చ‌క్కిలిగింత‌తో దాన్ని దక్కించుకోవాల‌ని ఈరోజే (5 డిసెంబ‌రు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ గురించీ, ఈ సినిమా గురించి సుమంత్ ఏమంటున్నాడంటే..

* హాయ్‌...
- హ‌లో అండీ..

* ఎలా ఉంది కెరీర్‌..
- ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు సినిమాలు చేశాను. `చ‌క్కిలిగింత‌` నా నాలుగో సినిమా.  ఏ సినిమాకీ లేనంత కాన్ఫిడెన్స్ ఈ సినిమాపై ఉంది. ఐ యామ్ రిలాక్స్‌..

* అంత న‌మ్మకం ఏమిటి?
- ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్త‌గా, విచిత్రంగా, గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. వేమా రెడ్డి గారు క‌థ చెప్పిన‌ప్పుడే నేను బాగా క‌నెక్ట్ అయిపోయా. ''అస‌లు ఈ ఆలోచ‌న మీకు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందండీ..'' అని కూడా అడిగా. నేను అన్ని భాష‌ల సినిమాలూ చూస్తుంటా. ఎక్క‌డా ఇలాంటి థాట్‌తో ఓ సినిమా రాలేదు. బేసిగ్గా మంచి కాన్సెప్టుల‌తో వ‌స్తే.. త‌ప్ప‌కుండా జ‌నం ఆద‌రిస్తారు. అందుకే అంత న‌మ్మ‌కం.

* ఇంత‌కీ మీ పాత్ర  ఏమిటి?  ఎలా ఉండ‌బోతోంది?
- సినిమా చూసిన‌వాళ్లంద‌రికీ ఈపాటికి తెలిసిపోయే ఉంటుంది. చూడ‌నివాళ్ల‌కు మాత్రం చెప్తా. నా పేరు అడీ. బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్‌ని. ప్రేమ‌పై నాకు ఓర‌క‌మైన అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయంతోనే ఓ థియ‌రీ త‌యారు చేస్తా. అదేంటి?  దాని వ‌ల్ల క‌థ ఎలాంటి మలుపు తిరిగింది... అనేదే సినిమా.

* ద‌ర్శ‌కుడు వేమారెడ్డి సుకుమార్ బ్యాచ్‌. ఆయ‌న ఫ్లేవ‌ర్ ఈసినిమాలో క‌నిపిస్తుందా..?
- త‌ప్ప‌కుండా. సుకుమార్ చాలా కొత్త‌గా ఆలోచిస్తుంటారు. ఆయ‌న సినిమాల్లో వైవిధ్యం క‌నిపిస్తుంది. అంద‌రూ ఆలోచించిన‌ట్టు ఆయ‌న ఆలోచించ‌రు. వేమారెడ్డి కూడా అంతే.

* ఆయ‌న సినిమాల్లో హీరోకే నెగిటీవ్ ల‌క్ష‌ణాలూ ఉంటాయి.. ఈ సినిమాలోనూ అంతేనా?
- అలాంటిదేం లేదు. 100 %  పాజిటీవ్  క్యారెక్ట‌రే. అయితే ఈ హీరోకుండే యాటిట్యూడ్ భిన్నంగా క‌నిపిస్తుంది. చాలామంది ఈ సినిమా `ఆర్య‌` లా ఉంటుంది అనుకొంటున్నారు. కానీ కాదు. మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్తున్నా.. ఇలాంటి క‌థ‌తో ఇది వ‌ర‌కెప్పుడూ సినిమాలు రాలేదు.

* న‌టుడిగా మీకు ఎంత వ‌ర‌కూ ప్ల‌స్ అవుతుంది?
- నిజం చెప్పాలంటే ఇంత వ‌ర‌కూ ఎప్పుడూ ఇంత హోమ్ వ‌ర్క్ చేయ‌లేదు. ఆడీ లా ప్ర‌వ‌ర్తించ‌డం, మాట్లాడ‌డం చాలా కష్టం. పెద్ద‌గా రిఫ‌రెన్సూ లేదు. ద‌ర్శ‌కుడిని ఫాలో అయిపోయా.

* రామ్‌ని ఇమిటేట్ చేస్తున్న‌ట్టు అనిపిస్తుంద‌ని చాలామంది చెప్తుంటారు. మీరేమంటారు..
- నేను కావాల‌ని ఎవ‌రినీ ఇమిటేట్ చేయ‌ను. నేను నేనులానే న‌టిస్తా. కాక‌పోతే మ‌న ప్ర‌మేయం లేకుండా వారి ప్ర‌భావం ప‌డొచ్చు.

* మీపై ఎవ‌రి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది?
- మా నాన్న‌గారి సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సెట్స్‌కి వెళ్లేవాడ్ని. మ‌హేష్‌, ప్ర‌భాస్‌, సునీల్‌.. వీళ్లంద‌రినీ ద‌గ్గ‌రుండి చూశా. వాళ్ల ఎటిట్యూడ్ గ‌మ‌నించా. సెట్స్‌కి ఎప్పుడొస్తారు?  అక్క‌డ వాళ్ల ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుంది?  క్ర‌మ‌శిక్ష‌ణ ఏమిటి?  ఇవ‌న్నీ బాగా గ‌మ‌నించా. వాళ్లే నాకు ఆద‌ర్శ‌మ‌య్యారు.

* చిన్న‌ప్ప‌టి నుంచే న‌ట‌న‌పై ఆస‌క్తి ఉండేదా?
- అస‌లు సినిమాల్లోకి రావాలన్న ఉద్దేశం ఉండేది కాదు. ఓ ద‌శ‌లో ద‌ర్శ‌కుడిని అవ్వాల‌నుకొన్నా. అయితే అనుకోకుండా ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నా.  ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నా ఫొటో చూసి ''మీ అబ్బాయి త‌ప్ప‌కుండా హీరో అవుతాడు. బాగా తీర్చిదిద్దండి'' అని నాన్న‌గారికి స‌ల‌హా ఇచ్చారు.  దాంతో నాలోనూ హీరో అవ్వాల‌న్న కోరిక పుట్టింది. 

* సంక్రాంతి రాజు అని మీ నాన్న‌గారికి పేరు. మ‌రి మీ సినిమా సంక్రాంతికి విడుద‌ల అయితే బాగుంటుంది అని ఎప్పుడూ అనుకోలేదా?
- సంక్రాంతి అన‌గానే సినిమాల‌కు పెద్ద పండుగ‌. అయితే అక్క‌డ పెద్ద సినిమాలు ఢీ కొట్ట‌డానికి రెడీగా ఉంటాయి. మేం చేసే చిన్న సినిమాల‌కు స్లాట్ దొర‌క‌డం చాలా క‌ష్టం. పైగా చిన్న సినిమాల‌కు మౌత్ ప‌బ్లిసిటీ చాలా కీల‌కం. టాక్ ద్వారా సినిమా బ‌య‌ట‌కు వెళ్లి, జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌చ్చేలోగా సినిమా తీసుస్తున్నారు. అందుకే థియేట‌ర్లు దొరికిన‌ప్పుడే  సినిమాని విడుద‌ల చేసుకోవాలి.

* సుమంత్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ప్ర‌స్తుతం ఒడిదుడుకుల్లో ఉంది.. మ‌ళ్లీ గ‌త వైభ‌వం చూసే అవ‌కాశం ఉందా?
- త‌ప్ప‌కుండా. మా నాన్న‌గారికి హిట్లూ, ఫ్లాపులూ మామూలే. వ‌రుస‌గా నాలుగు సూప‌ర్ హిట్లు ఇచ్చారు. ఆ త‌ర‌వాత ఫ్లాపులు. మ‌రోహిట్లూ, ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఫ్లాపు. పౌర్ణ‌మి నుంచి టైమ్ క‌ల‌సి రాలేదు. ఆ సినిమాకి ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు. హీరో, ద‌ర్శ‌కుడు వీళ్ల‌కు ఓ ఇమేజ్ వ‌చ్చిన త‌ర‌వాత‌.. రెండు మూడు ఫ్లాపులు వ‌చ్చినా ఫ‌ర్లేదు. మ‌రో హిట్‌తో  నిల‌దొక్కుకొంటారు. నిర్మాత‌ల‌కు అలాంటి ప‌రిస్థితి ఉండుదు. ఆయ‌న‌కు ఇప్ప‌టికీ సినిమాలే లోకం. రోజూ ఏదో ఓ సినిమా చూస్తూనే ఉంటారు. త‌ప్ప‌కుండా ఆయ‌న మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తారు.

* త‌రువాతి సినిమాలేంటి?
- కేరింత‌లో న‌టిస్తున్నా. మ‌రో కొత్త సినిమా ఒప్పుకొన్నా. త్వ‌ర‌లోనే వివ‌రాలు చెబుతా.

* ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ చ‌క్క‌లిగింత‌.
- థ్యాంక్యూ...

సాయి

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka