Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rakul preet singh acting in hindi movies also.......

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్టీయార్‌ డాన్సులే డాన్సులు

excellent dance...

ఎంతకాలమైంది ఎన్టీయార్‌ డాన్సుల్లో సత్తా చాటి? ఆ లోటు తీర్చడానికే ‘టెంపర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ నందమూరి చిన్నోడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రానున్న ‘టెంపర్‌’ సినిమాలో ఎన్టీయార్‌ డాన్సులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడట. మంచి బీట్స్‌, దానికి తగ్గ డాన్స్‌ కంపోజింగ్‌తో ‘టెంపర్‌’ సాంగ్స్‌ అభిమానులకు పూర్తి ఆనందాన్నిస్తాయట.

‘టెంపర్‌’ కోసం శరీరాన్ని కండలు తిరిగేలా మలచుకున్న ఎన్టీయార్‌, ఆ ఫొటోలతోనే టెంపర్‌పై అంచనాల్ని రెట్టింపు చేసేశాడు. పూరి డైరెక్షన్‌లో ఎన్టీయార్‌ హీరోగా ఇప్పటికే వచ్చిన ‘ఆంధ్రావాలా’ ఫెయిలయ్యింది. ఆ లోటు తీర్చుకోడానికి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ తయారు చేశానని పూరి జగన్నాథ్‌ ‘టెంపర్‌’ సెట్స్‌ మీదకు రాకముందే చెప్పాడు.

చెప్పిన మాట ప్రకారం పూరి జగన్నాథ్‌ తనకే ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌తో ఎన్టీయార్‌ని ‘టెంపర్‌’లో అద్భుతంగా చూపించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. పూరి టేకింగ్‌, ఎన్టీయార్‌ డాన్సులతో ‘టెంపర్‌’ అభిమానుల్ని ఉర్రూతలూగించడం ఖాయంగానే కన్పిస్తోంది. సంక్రాంతికి ‘టెంపర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
never repeat