ఓ సినిమా ఇవరయ్యేళ్ళు ఒకే థియేటర్‌లో ప్రదర్శితమవడం చరిత్ర. భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఆ ఘనత సాధించిన సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’. షారుక్‌ఖాన్, కాజోల్ నటించారు ఈ సినిమాలో జంటగా. ఈ సినిమా చాలా తెలుగు సినిమాలకు ప్రేరణ. హిందీలో కూడా ‘డీడీఎల్‌జే’ స్ఫూర్తితో ఎన్నో సినిమాలొచ్చాయి.
ముంబైలోని మరాఠా మందిర్ అనే థియేటర్‌లో వెయ్యి వారాల ప్రదర్శన పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం మళ్ళీ ప్రమోషన్ చేస్తున్నారు షారుక్, కాజోల్. ఇరవయ్యేళ్ళు పూర్తి చేసుకున్నందుకుగాను ఓ కార్యక్రమం నిర్వహిస్తూ, దానికోసం ప్రోమో తయారు చేయడం అంటే మాటల కాదు. ఆనాటి తీపి జ్ఞాపకాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని నటీనటులు అంటున్నారు.
అద్భుతాలు అరుదుగానే సంభవిస్తాయి. అలాంటి వాటి కోవలోకే ‘డిడిఎల్‌జే’ కూడా చేరుతుంది. ఈ సినిమాలో అమ్రిష్‌పురి నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అనుపమ్‌ఖేర్ ఓ తండ్రిగా చూపిన నటనా ప్రతిభకు హేట్సాఫ్ అనాల్సిందే ఎవరైనా. ప్రేమకథా చిత్రాలకు సరికొత్త దారి చూపించిన ‘డీడీఎల్‌జే’ చరిత్రలో నిలిచిపోతుంది.
|