Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
never repeat

ఈ సంచికలో >> సినిమా >>

తెలంగాణ బ్రీత్‌లెస్‌ సాంగ్‌

telangana breathe less song

తెలంగాణలోని పది జిల్లాల ప్రత్యేకతను చాటి చెబుతూ బ్రీత్‌లెస్‌ సాంగ్‌ని రూపొందించారు. ‘బందూక్‌’ పేరుతో రానున్న సినిమా కోసం ఈ ప్రయోగాన్ని చేశారు. జనపదాల్ని రచించడంలో దిట్ట అయిన గోరటి వెంకన్న ఈ పాటకు రూపకల్పన చేశారు. మొదటగా ఈ పాటను ఇంటర్నెట్‌లో పెట్టారు. దానికి మంచి స్పందన లభించింది.

ఇదివరకు కూడా బ్రీత్‌లెస్‌ సాంగ్స్‌ చాలా వచ్చినప్పటికీ ఇది తెలంగాణ పాట. తెలంగాణ మంత్రివర్యులు జగదీశ్వర్‌రెడ్డి పాట గురించి మాట్లాడుతూ, తెలంగాణలోనూ టాలెంట్‌ వుందని చెప్పేందుకు సజీవ సాక్ష్యం ఈ బ్రీత్‌లెస్‌ సాంగ్‌ అని కొనియాడారు. ఇంటర్నెట్‌లో పాటకు మంచి స్పందన వచ్చినట్లే, ‘బందూక్‌’ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు జగదీశ్వర్‌రెడ్డి.

సినిమాకి సంబంధించిన 24 శాఖల్లోనూ పూర్తిగా తెలంగాణవారితోనే తెరకెక్కిన చిత్రం ‘బందూక్‌’ అని చిత్ర నిర్మాత, దర్శకుడు వెల్లడిరచారు. తెలంగాణ పాట, తెలంగాణ సినిమా ప్రత్యేకమైనదని ‘బందూక్‌’ నిరూపిస్తుందనీ, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని చిత్ర రూపకర్తలు అభిప్రాయపడ్డారు. ‘బందూక్‌’ బ్రీత్‌లెస్‌ సాంగ్‌ ఇంటర్నెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది.

మరిన్ని సినిమా కబుర్లు
increasing expectations