Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ: లాగిన కొద్దీ కదిలిన డొంక లాగా ఎమ్మెల్యే మోసాలు బయటపడుతాయి. అటు చెల్లెలి పెళ్ళి ఇటు ఎమ్మెల్యే వ్యవహారం ఏకాంబర్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.
ఆ తరువాత..................

........................................................

భర్త పేర ఈమె పేర వుంది. ఆయన చనిపోయారు. ఈ డెత్ సర్టిఫిట్లు ఇవ్వాలి. అకౌంట్ నంబర్ కరెక్టో కాదో కన్ ఫర్మ్ చేసుకుందామని అన్నాడు ఏకాంబర్.

చకా చకా కంప్యూటర్లో చెక్ చేసి అది బండ్ల రాజు, బండ్ల సత్యవతి గార్ల ఎయిదర్ ఆర్ సర్వైర్ అకౌంట్. ఇందులో లక్షా ఆరువేల రూపాయలు ఉన్నాయి. ఏమన్నా డబ్బు డ్రా చెయ్యాలంటే మీ దగ్గర చెక్కు బుక్కు వుంది కదా! అందులో రాసి ఇవ్వాల్సి  వుంటుంది అంది.ఏకాంబర్ కి మతిపోయింది, సత్యవతికి, ఆమెతో వచ్చిన ఆడవాళ్ళకి ఏమీ అర్ధం కావడం లేదు.

సార్ మీరు బ్రాంచి మేనేజర్ గారిని కలవండి సార్! డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు కదా అంటూ ఆ అమ్మాయి మరో కస్టమర్ తో మాట్లాడుతూ వుండిపోయింది.

సత్యవతిని తీసుకుని బ్యాంకు మేనేజర్ కేబిన్ లోకి అడుగుపెట్టాడు ఏకాంబర్.

పాపం ! వీళ్ళందర్నీ అమాయకుల్ని చేసి వాళ్ళ పేర వ్యాపారాలు చేస్తూ బినామీ అకౌంట్ లు నిర్వహిస్తున్నాడు. మనసులోనే తిట్టుకున్నాడు ఏకాంబర్.

ఈలోగా డాక్యుమెంట్లు చూస్తున్న మేనేజర్. తల ఎత్తి వారికేసి చూసాడు.

చెప్పండి సార్! ఏం కావాలి? అడిగాడు బ్రాంచి మేనేజర్.

ఈమె పేర, ఈమె భర్త పేర మీ బ్యాంకులో ఒక అకౌంట్ వుంది అని జిరాక్స్ కాపీ ఆయన చేతికిచ్చాడు ఏకాంబర్...

ఓకే..  చెప్పండి నేనేం చేయాలి అన్నారు బ్రాంచి మేనేజర్..

కొత్త పాస్ బుక్ ఇప్పించాలి అన్నాడు ఏకాంబర్.

జాయింట్ అకౌంట్ కదా.. ఇద్దరూ కలిసి పాస్ బుక్ పోయిందని ధరఖాస్తు ఇవ్వాలి సార్ అన్నాడు మేనేజర్.

ఆయన ఈ మధ్య చనిపోయారు సార్! ఇదిగోనండీ డెత్ సర్టిఫికెట్ అని ఇచ్చాడు ఏకాంబర్. డెత్ సర్టిఫికెట్  చూస్తూ పోనీలేండి.. చెక్ బుక్ వుండాలి కదా మీదగ్గర సత్యవతిని చూస్తూ అన్నాడు మేనేజర్..

సార్ చెక్ బుక్ కూడా లేదు సార్.. చనిపోయే ముందు అవన్నీ తీసుకెళ్ళాడట సార్.. అని ఏకాంబర్ అన్నాడు.

సత్యవతి, ఏకాంబర్ ఆలోచనను అర్ధం చేసుకుని అవును సార్! అంది దీనం గా..

మీరెవరో తెలీదు. ఇలా జిరాక్స్ కాపీ తో ఈవిడని గుర్తించడం చాలా కష్టం. అనుమానం గా చూస్తూ అన్నాడు మేనేజర్.

సార్ మేము ఆ అకౌంట్ లో వున్న డబ్బు తీసెయ్యాలని రాలేదు. ఇదిగోనండి! ఇది అందులో వేద్దామని వచ్చాం.

మేనేజర్ ముందుంచాడు ఏకాంబర్.

" వ్వాట్ ముప్ఫై లక్షలా! మేడం గారివేనా? " ఆశ్చర్యంగా అడిగాడు మేనేజర్.

ఇన్స్యూరెన్స్ చెక్కు సార్" చెప్పాడు ఏకాంబర్.

ఈ అకౌంట్ లోనుండి డబ్బు ఎక్కణ్ణుంచి వస్తున్నదీ, ఎటు పోతున్నదో  మేనేజరు వివరంగా చెప్పెసరికి నిర్ఘాంతపోయారు ఏకాంబర్, సత్యవతి. తమ బ్యాంక్ లో వాళ్ళ పిల్లలపేర ఫిక్స్ డ్ డిపాజిట్స్ చేయిస్తాననేసరికి అన్నీ చకచకా పూర్తిచేసాడు మేనేజర్." వస్తా సార్..." అని అక్కణ్ణుంచి బయల్దేరాడు ఏకాంబర్.

************

కళకళలాడుతున్న కళ్యాణ మండపం....

బిజీగా ఉన్నాడు ఏకాంబర్...

ఇంతలో స్కార్ఫియో లోంచి దిగాడు ఎమ్మెల్యే, అతడి అనుచరులు....

వస్తూనే నేరుగా ఏకాంబర్ దగ్గరకొచ్చి కాలరు పట్టుకుని ఎమ్మెల్యే దగ్గరకు లాకుపోయాడు.

" ఏరా డబ్బు నేను కడితే చెక్కు దానికిప్పిస్తావా? " ఆరోజు దినపత్రికల్లోని వార్తను చూపిస్తూ అరిచాడు ఎమ్మెల్యే. అప్పుడు చూసాడు ఏకాంబర్ ఆ పేపర్లు. నిన్నటిరోజున ముప్పై లక్షల చెక్కును ఇన్స్యూరెన్స్ కంపనీ చైర్మన్ సత్యవతికిస్తున్న ఫోటోలు అవి.ఓహో అదా విషయం అనుకున్నాడు.... ఇంతలో అహూతులందరూ ఏం జరుగుతోందో అర్థం కాక అక్కడకు చేరుకున్నారు. ఏకాంబర్ మీద దాడి చేయబోయిన ఎమ్మెల్యే అనుచరుల నుండి ఏకాంబర్ ని కాపాడేందుకు స్వయంగా అతడి అనుచరుల భార్యలే రక్షణ వలయంగా నిలబడ్డారు. అప్పటికేమీ చేయలేక అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే, అతడి అనుచరులు.

*****************

ఆ మర్నాడు...

ఏకాంబరాన్ని ఈడ్చుకు రమ్మని పురమాయించిన ఎమ్మెల్యేకి, తాము ఆపని చేయలేమనీ, ఎందుకంటే తమ భార్యలు ఏకాంబరానిక్

ఏమన్నా జరిగితే ఊర్కోమన్నారని ఖరాఖండీగా చెప్పేసారు అతడి అనుచరులు.....

అందుకని వేరే గూండాల ద్వారా ఏకాంబరాన్ని అంతం చేయడానికి నిశ్చయించుకున్నాడు ఎమ్మెల్యే. 

****************

అనుచరుల పేర ఎమ్మెల్యే అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి బస్సులు నడిపించడం, ఆ ఆదాయాన్ని మరోవైపు మళ్ళించడం  అంతా ఏకాంబర్ ద్వారా తెలుసుకున్న అనుచరులలో ఇప్పుడు చతన్యం వచ్చింది. తామే స్వయంగా ఆ బస్సులను నడుపుకోని ఉపాధి పొందేందుకు డృఢంగా నిశ్చయులైనారు. దగ్గరుండి ఈ విషయాలన్నీ తమకు చెప్పి చైతన్యవంతులను చేసినందుకు అనుచరులకూ, చనిపోయిన బండోడి భార్యకు చెక్కు ఇప్పించినందుకు అనుచరుల భార్యలకూ ఏకాంబర్ గొప్పగా కనిపించి, మార్గ దర్శకుడయ్యాడు.ఏకాంబర్, ఎమ్మెల్యే అనుచరులున్న చోటికి రొప్పుతూ వచ్చిన పీ.ఏ. ఏకాంబరాన్ని చంపించేందుకు మరో గూండాను పంపబోతున్నాడని చెప్పేసరికె, అనుచరులందరూ ఏకాంబర్ ని కాపాడేందుకు అవసరమైతే ఎమ్మెల్యేని ఎదిరిస్తామని ముక్త కంఠం తో అన్నారు. అప్పుడు పీ.ఏ.." ఏంటిరా మీరు ఎదిరించేదీ? ఎదిరించిన బండోడు ఏమైపోయాడో తెలుసుగా" అంటూ నాలిక్కరుచుకున్నాడు... ఆ తర్వాత ఏకాంబర్, ఎమ్మెల్ల్యే అనుచరుల బలవంతం మీద అతడు చెప్పిన విషయం విని అందరికీ మతిపోయింది...

." అది సార్ జరిగిన విషయం... తమ పేర అకౌంట్స్ ఉన్న విషయం తెలిసి వాటి గురించి నిలదీసిన బండోడు శవమై సముద్రంలో తేలాడు.... ఇప్పుడు ఏకాంబరాన్ని చంపించడానికి ఫలానా గూండాలను పురమాయించి దాడి జరిపించాడు..."

పోలీస్ కమీషనర్ ముందు సాక్ష్యం చెప్పాడు పీ.ఏ.

ఆ వారంలోనే స్పీకర్ పర్మిషన్ తో ఎమ్మెల్ల్యే మేడిపండు అబద్దాలరావుని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.ఏజెంట్ ఏకాంబర్ వలన ఎమ్మెల్ల్యే చేసే మోసాలన్నీ బయట పడ్డాయని ఆధారాల్తో సహా దిన పత్రికలన్నీ కోడై కూసాయి. విశాఖపట్నం లో ఇప్పుడు " ఏజెంట్ ఏకాంబర్ " జగమెరిగిన బ్రాహ్మడయ్యాడు. అతను తిరక్కుండానే పాలసీదారుల నుండి పిలుపులు వస్తున్నాయి.

*************

పీతాంబరం అనుకున్నట్టుగానే ఒకే వేదిక మీద రెండు పందిళ్ళలో ఇద్దరు కొడుకులవీ పెళ్ళిళ్ళు జరిపించాడు....

                                 xxxxxxxxxxxxxxxxx శుభం xxxxxxxxxxxxxxxxxxx

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana