Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

వెరీ very special director

very very  special director

ఓకే అంటే స్టార్‌ హీరోస్‌ క్యూ కడ్తారుగానీ, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, తన కథకు తగ్గ హీరోలనే ఎంపిక చేసుకుంటున్నాడు. హీరో కోసం కథ కాకుండా, కథ కోసం హీరో అనేది శ్రీకాంత్‌ పాలసీ. ‘కొత్త బంగారు లోకం’ తీసినా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తీసినా, ఆ సినిమాల్లో నటీనటులు, దర్శకుడు తమకిచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు.

‘ముకుంద’ సినిమా కూడా అంతేనట. హీరోయిన్‌ పూజా హెగ్దే, హీరో వరుణ్‌తేజ (నాగబాబు తనయుడు) దర్శకుడు సినిమా కథ చెప్పిన విధానం, తీస్తున్న విధానం చాలా అద్భుతమని చెబుతూ, కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా ఆయనే తగు జాగ్రత్తలు తీసుకునేవారని వెల్లడిరచారు.

ఎప్పుడు ఎవర్నీ ఎక్కువగా పొగడని సినీ పాటల రచయిత సీతారామ శాస్త్రి అంతటివారే శ్రీకాంత్‌ అడ్డాలను ప్రత్యేకంగా అభినందించారు. పొగడ్తల కోసం పొగడ్తలు అన్నట్లుగా కాకుండా, తీస్తున్న సినిమాల ద్వారా, ఆ సినిమాల ద్వారా చూపిస్తున్న తెలుగుదనం ద్వారా సినీ పరిశ్రమ పెద్దల మనసు అందుకుంటున్న ‘ముకుంద’ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల, తన తాజా చిత్రం ‘ముకుంద’తో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
long live chakri