Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
long live chakri

ఈ సంచికలో >> సినిమా >>

విక్రమ్‌, శంకర్‌లకే చెల్లింది

hats off to vikram and shankar

ఎన్నో అంచనాలతో సెట్స్‌ మీదకు వెళ్ళిన ‘ఐ’ సినిమా విడుదలకు ముందు నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమా విడుదల కొన్ని కారణాలతో వాయిదా పడటం వల్లే ఇది జరిగింది. కాని వచ్చే నెలలో, సంక్రాంతి ముందు ‘ఐ’ విడుదలవుతుండడంతో సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నెగెటివ్‌ టాక్‌ ఇప్పుడు ఎక్కడా వినిపంచడంలేదు.

శంకర్‌ సినిమాకి కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా, తెలుగు, హిందీ అభిమానుల్లో కూడా హైప్‌ ఉంటుంది. ఆ హైప్‌ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. సినిమాపై విషప్రచారం జరుగుతున్నా స్పందించకపోవడం, సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శంకర్‌ కష్టపడుతుండడంతో, సినిమా పట్ల శంకర్‌ నిబద్ధత, సినిమా కోసం విక్రమ్‌ పడ్డ కష్టాన్ని గుర్తిస్తున్నారు అందరూ. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నారు.

ఏ సినిమా రిజల్ట్‌ అయినా సినిమా విడుదలైతేనే తెలుస్తుంది. జనవరి రెండో వారంలో వస్తున్న ‘ఐ’ రిజల్ట్‌ ఎలా ఉన్నా, భారీ విజయం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషించాయి. హైప్‌ తగ్గిన సినిమాకి తిరిగి హైప్‌ పెరుగుతుందంటే అది శంకర్‌, విక్రమ్‌ల వల్లనే సాధ్యమైందని చెప్పడం అతిశయోక్తి కాదు.

మరిన్ని సినిమా కబుర్లు
small movies celebration