Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - ముకుంద

Movie Review - Mukunda

చిత్రం: ముకుంద
తారాగణం: వరుణ్‌ తేజ, పూజా హెగ్దే, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, అలీ, రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, నాజర్‌, శేఖర్‌ కమ్ముల తదితరులు
చాయాగ్రహణం: మణికందన్‌
సంగీతం: మిక్కీ జె మేయర్‌
నిర్మాణం: లియో ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, మధు
విడుదల తేదీ: 24 డిసెంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
తన స్నేహితుడు అర్జున్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ సోదరుడి కూతుర్ని ప్రేమించి ఇబ్బందుల్లో పడితే, అతడికి అండగా నిలుస్తాడు ముకుంద (వరుణ్‌తేజ). అలా మున్సిపల్‌ ఛైర్మన్‌ (రావు రమేష్‌)తో ముకుంద తలపడాల్సి వస్తుంది. స్నేహితుడ్ని రక్షించే క్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌తో తలపడిన ముకుంద తన స్నేహితుడి ప్రేమను గెలిపించాడా? మున్సిపల్‌ ఛైర్మన్‌తో తలపడే క్రమంలో ముకుంద ఎదుర్కొన్న సమస్యలేంటి? అనేవి తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే:
తొలి సినిమానే అయినా వరుణ్‌ తేజ కాన్ఫిడెంట్‌గా కన్పించాడు. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంది. చిన్న చిన్న ఇబ్బందుల్ని వరుణ్‌ తదుపరి సినిమాకి అధిగమించే అవకాశం ఉంది. డాన్సుల్లో ఇంకా రాణించాలి. యాక్షన్స్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. పూజా హెగ్దే చాలా అందంగా ఉంది. ఆమె గ్లామర్‌ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.
ప్రకాష్‌రాజ్‌ తన స్టాండర్డ్‌కి తగ్గట్టు నటించాడు. రావు రమేష్‌ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఈ సినిమాకి అతని నటన ఓ హైలైట్‌. రఘుబాబు కాసిన్ని నవ్వులు పూయించాడు. అలీకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.

చెప్పుకోడానికి మామూలే కథే అయినా కథనంలో వెరైటీని చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ప్రెజెంటేషన్‌ రిచ్‌గా వుంది. నెరేషన్‌ కొన్ని సీన్స్‌లో బావుంటే, మరికొన్ని సీన్స్‌లో అంచనాలకు తగ్గట్టుగా లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. అన్ని పాటలూ వినడానికి బాగున్నాయి. చూడ్డానికి మూడు పాటలు ఇంకా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. బ్యాక్‌డ్రాప్‌కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ దర్శకుడి అభిరుచికి తగ్గట్టుగా ఉంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా పబ్లిసిటీ చేశారు. టైటిల్‌ కూడా సాఫ్ట్‌గా ఉండడం, దర్శకుడి గత చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ కావడంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఆ యాంగిల్‌లోనే పెరిగాయి. అయితే ఈసారి దర్శకుడు యాక్షన్‌ని నమ్ముకున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ మిస్సయ్యింది, ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా తగ్గింది. ఫస్టాఫ్‌ స్మూత్‌గా సాగిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, హ్యూమర్‌, రొమాన్స్‌ సమపాళ్ళలో కలిసి సాఫీగా ఫస్టాఫ్‌ సాగిపోతే, సెకెండాఫ్‌ మాత్రం సెంటిమెంట్‌, మెలోడ్రామాతో అంత వేగంగా ముందుకు సాగలేదు. సెకెండాఫ్‌ మీద దర్శకుడు ఇంకాస్త ఫోకస్‌ పెట్టి ఉంటే, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంకొంచెం పెంచి ఉంటే బెటర్‌ రిజల్ట్‌ని దక్కించుకుని వుండేదే. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఓకే అనిపిస్తుంది. యాక్షన్‌ని ఇష్టపడేవారినీ ఓ మోస్తరుగా మెప్పిస్తుంది. మౌత్‌ టాక్‌ పోజిటివ్‌గా స్ప్రెడ్‌ అయితే సినిమా సేఫ్‌ జోన్‌లోకి వెళుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: ముకుంద ఓ మంచి ప్రయత్నం

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Chinnadana Nee Kosam