Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Mukunda

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - చిన్నదాన నీకోసం

Movie Review - Chinnadana Nee Kosam

చిత్రం: చిన్నదాన నీకోసం
తారాగణం: నితిన్‌, మిస్తి చక్రవర్తి, నరేష్‌, సితార, అలీ, నాజర్‌, ధన్య బాలకృష్ణన్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు
చాయాగ్రహణం: ఐ ఆండ్రూ
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాణం: శ్రేష్ట్‌ మూవీస్‌
దర్శకత్వం: కరుణాకరన్‌
నిర్మాత: ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
విడుదల తేదీ: 25 డిసెంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
సరదాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేసే కుర్రాడు నితిన్‌ (నితిన్‌) తొలి చూపులోనే నందిని (మిస్తి)తో ప్రేమలో పడతాడు. నందినికి నితిన్‌ అంటే ఇంట్రెస్ట్‌ లేకపోయినా, తన అవసరం కోసం ఏదో ఒక రూపంలో నితిన్‌తోనూ, అతని కుటుంబ సభ్యులతోనూ టచ్‌లో ఉంటుంది. అయితే ఓ సందర్భంలో నితిన్‌కి చెప్పా పెట్టకుండా నందిని విదేశాలకు చెక్కేస్తుంది. ఆమె జాడ కనుక్కోడానికి విదేశాలకు పయనమవుతాడు నితిన్‌. నితిన్‌ ప్రేమను నందిని అర్థం చేసుకుందా? ఏ అవసరం కోసం నితిన్‌ వెంట నందిని పడిరది? అనేవి తెరపై చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే:
సినిమా సినిమాకి నితిన్‌ పెర్ఫామెన్స్‌లో ఈజ్‌ పెరుగుతోంది. ‘ఇష్క్‌’ ముందు వరకూ నితిన్‌ ఒకలా ఉంటే, ఆ సినిమా తర్వాత నితిన్‌ నటనలో వచ్చిన మార్పులు సూపర్బ్‌. చాలా ఈజీగా తన సినిమాల్లోని పాత్రల్లో ఒదిగిపోతున్నాడు. డాన్సులు చాలా బాగా చేశాడు. మిస్తి అందంగానూ, క్యూట్‌గానూ ఉంది. నటన కూడా బాగా చేసింది. ఏ సినిమాలో ఏ పాత్ర చేసినా సహజమైన నటనతో ఆకట్టుకునే నాజర్‌ ఈ సినిమాలోని పాత్రనూ అవలీలగా పోషించేశాడు. అలీ కామెడీ ఓకే. ఇంకా అతన్ని బాగా వాడుకుని ఉండాల్సింది. సీనియర్‌ నటులు నరేష్‌, సితార మామూలే. తాగుబోతు రమేష్‌ తన ట్రేడ్‌మార్క్‌ కామెడీ పండిరచేందుకు ప్రయత్నించాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదనిపించారు. సంగీతం బావుంది. దానికన్నా అనూప్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇంకా బావుంది. పాటలన్నీ విజువల్‌గా బావున్నాయి. ఓ పాటల్లో నితిన్‌ డాన్స్‌ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకీ, ప్రత్యేకించి పాటలకూ కొత్త అందాన్నిచ్చింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమయ్యేంత రీతిలో ఉపయోగపడ్డాయి. మాటలు బాగానే ఉన్నాయి. రిచ్‌గా సినిమా రూపొందింది. మామూలు కథనే కొత్తగా చెప్పాలని దర్శకుడు చూశాడు. స్క్రీన్‌ప్లే అంత గొప్పగా ఏమీలేదు. జస్ట్‌ ఓకే. ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలున్నాయి. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. సినిమా భారాన్నంతా నితిన్‌ తన భుజాల మీదే మోసేందుకు ప్రయత్నించాడు. కామెడీ, రొమాన్స్‌ వంటి అంశాలతో సాఫీగా ఫస్టాఫ్‌ వెళ్ళిపోగా, సెకెండాఫ్‌ కొంచెం డ్రాగింగ్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా ఫీల్‌ గుడ్‌ మూవీ అనిపిస్తుంది. ప్రేమకథని ఇంకాస్త బాగా అల్లి, స్క్రీన్‌ప్లేపై జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమాకి ఇంకా బెటర్‌ రిజల్ట్‌ వచ్చేది. బాక్సాఫీస్‌ వద్ద సినిమా ఎబౌ యావరేజ్‌ అనిపించుకుంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: ఈ చిన్నది జస్ట్‌ ఓకే

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka