Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
wonderful 'pk'

ఈ సంచికలో >> సినిమా >>

అందంతో కట్టిపడేస్తోన్న గోపిక

gopika doing magic with her beauty

తెలుగు తెరకు హీరోయిన్ల కొరత ఉంది. ఆ కొరతను తీర్చడానికి వచ్చినట్టుంది గోపిక. ‘ముకుంద’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్దేనే ఈ గోపిక. సినిమాలో తన అంద చందాలతో అలరించిన పూజా హెగ్దేకి తెలుగులో విడుదలైన తొలి సినిమా ‘ఒక లైలాకోసం’ కూడా మంచి విజయాన్నే ఇచ్చింది.

అందానికి అందం. యాక్టింగ్‌లోనూ మంచి మార్కులేయించుకున్న పూజా హెగ్దే, బాలీవుడ్‌కి వెళుతోంది. హిందీలో హృతిక్‌ రోషన్‌తో ఓ సినిమా చేస్తోందీ అందాల భామ. హిందీకి వెళితే తిరిగిరాదేమో అని ‘ముకుంద’ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకలో సినీ ప్రముఖులు అనుమానం వ్యక్తం చేశారు. పూజ మాత్రం తెలుగు సినిమాని ఎప్పటికీ మర్చిపోనంటోంది.

హీరోయిన్‌గా తనకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి, హిందీ సినిమాల్లో నటించినా, తెలుగులో కూడా హీరోయిన్‌గా కొనసాగుతానని వివరించింది. తెలుగమ్మాయిలే తెలుగు మాట్లాడ్డానికి ఇష్టపడక, తెలుగింగ్లీష్‌ మాట్లాడేస్తోంటే, పూజా హెగ్దే తెలుగులో ఎంచక్కా పాటలు కూడా పాడుతుంది. అచ్చం తెలుగమ్మాయి అనిపించుకున్న పూజా హెగ్దే, తెలుగులో హీరోయిన్‌గా ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించేద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
again with'andala rakshasi'