Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
natyabharateeyam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం ( డిసెంబర్ 26 నుండి జనవరి 1 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈ వారం మొత్తంమీద  వారం పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు నూతన ప్రయత్నాలకు సమయం ఇస్తారు. బంధుమిత్రులతో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. విందులలో పాల్గొనే అవకాశం కలదు,ఆర్థికపరమైన విషయల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే ఖర్చులు కూడా పెరుగుతాయి. తోటివారితో మాటలను జాగ్రత్తగా వాడుట వలన స్వల్ప విభేదాలు తగ్గుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రణాళికలు అవసరం ప్రయాణాలు చేయుట వలన శారీరకశ్రమ తప్పక పోవచ్చును కావున అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకోండి మంచిది.  

 

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులు ముందుకు కదులుతాయి చిన్న చిన్న ఇబ్బందులు తొలగుటకు ఆక్సరం కలదు. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మేలుచేస్తుంది. ఉద్యోగపరమైన విషయాలకు సమయస్పూర్తి అవసరం నలుగురిని కలుపుకొని వెళ్ళండి. ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సేవాకార్యక్రమాలలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది దానిమూలాన నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. బంధువులతో సమయాన్ని గడుపుతారు. దూరప్రదేశం నుండి వార్తను వినే అవకాశం కలదు అలాగే ప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.  

 

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయలకు సమయం ఇచ్చే అవకాశం కలదు. పెద్దల నిర్ణయాలకు ఆమోదం తెలుపట అనేది తెలివైన నిర్ణయం. వృత్తిసంభందమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు మాములుగా ఉంటుంది కావున నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి అబివృద్ది ఉంటుంది. ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం కలదు అయినను ఊహించిన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు చేపట్టుట సూచన నిదానం అవసరం. ప్రయాణాలు చేయునపుడు మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన.

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట మంచిది అలాగే సమయానికి భోజనం చేయండి. ప్రయాణాల విషయంలో తొందరపాటు ఆలోచనలు చేయకపోవడం అనేది సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పక పోవచ్చును కావున అధికారులతో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది,నలుగురిని కలుపుకొని వెళ్ళండి మంచిది. మిత్రులతో కలిసి వినోదాలకు సమయం కేటాయిస్తారు సమయాన్ని సరదాగా గడుపుతారు. వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన ఊహించని ఖర్చులు పెరుగుతాయి.

 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద సామాజిక రంగాల్లో పనిచేయాలనే మీ కోరికకు బలమైన సహకారం అందుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుటకు ఆకాశం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు. తలపెట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది కాకపోతే ఎవ్వరితోను మాటపట్టింపులు రాకుండా చూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఆరోగ్యం విషయంలో స్వల్పపాటి శ్రద్ధను వహించుట అన్నివిధాల మంచిది. కళారంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు వచ్చుటకు అవకాశం కలదు. ఆశించిన విధంగా నూతన అవకాశాలు పొందుతారు. అలాగే ఆర్థికంగా బాగుంటుంది.

 

కన్యా రాశి
ఈ వారం మొత్తంమీద ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు,గతంలో మధ్యలో ఆపివేసిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు మిత్రులతో కలిసి విందులలో పాల్గొనే అవకాశం కలదు. నలుగురిని కలుపుకొని వెళ్ళుట పెద్దల భిప్రయలాకు అనుగుణంగా నడుచుకొనుట సూచన , తోటివారితో మాటపట్టింపులకు పోకపోవడం సూచన. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారిమూలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. అబివృద్దిని పొందుటకు అవకాశం కలదు. మాటతీరును చాలావరకు మార్చుకొనే ప్రయత్నం చేయండి దాని మూలాన మేలుజరుగుతుంది

తులా రాశి

ఈ వారం మొత్తంమీద ఆరంభంలో ఒకవార్త మిమ్మల్ని కొంత నిరుత్సాహంకు గురిచేసే అవకాశం ఉంది. ఆరోగ్యం మిమ్మల్ని కొంత భాధకు గురిచేసే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల పట్ల సరైన అవగాహన ఉంటె ఆశించిన ఫలితాలు రావోచ్చును. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు పొందుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. శ్రమకు తగ్గఫలితం పొందుటకు అవకాశం ఉంది.  వ్యాపారస్థులకు ఓపిక అవసరం అలాగే పెద్దల సూచనలు పాటించుట మంచిది. కళారంగంలోని వారికి కుటుంభంలోని వ్యక్తుల ద్వార నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది అలాగే నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త.

 

వృశ్చిక రాశి

.......ఈ వారం మొత్తంమీద ప్రయాణాలు చేస్తారు వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నలుగురితో కలిసి పనిచేయునపుడు వారి సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది కావున తొందరపాటు వద్దు. వివాదాలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. పనిఒత్తిడి ఉండుటకు ఆస్కారం ఉంది సమయానికి భోజనం చేయకపోతే అనారోగ్యసమస్యలు తప్పక పోవచును. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టిన పెట్టుబడులు లబ్దిని ఇచ్చుటకు అవకాశం ఉంది. ఆలోచనలు అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి లేకపోతే విబేదాలు తలెత్తుటకు అవకాశం ఉంది. నూతన పరిచయలకు ఆస్కారం కలదు వాటికి సమయం ఇస్తారు.

 


ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనులకు సమయం ఇస్తారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో కలిసి సమయం గడుపుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. పెద్దల నుండి నచ్చిన వార్తలు వినుటకు ఆస్కారం కలదు. అనవసరమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు బాగుంటుంది పెద్దల నుండి ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సమయపాలన వలన మీకు మేలుజరుగుతుంది.

 

మకర రాశి
ఈ వారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి అవతలి వారి సూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినను చివరకు విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంభంలో ని ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది కావున విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంభంలో నూతన నిర్ణయాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది,అనుకోని మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఊహించని ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు
 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగి ఉండి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. దూరప్రదేశం నుండి వచ్చే వార్తా సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారపరమైన విషయల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కొంత ఆలస్యంగా పూర్తిచేసే అవాకాశం ఉంది. కుటుంభంలో నూతన ఆలోచనలు చేయకపోవడం అనేది సూచన,బంధుమిత్రులతో స్వల్ప విబేదాలు కలుగుటకు అవకాశం ఉంది మాటపట్టింపులకు పోకండి. ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున ఎటువంటి అశ్రద్ద కూడదు. వ్యాపారస్థులకు పెట్టుబడులు అనుకూల్సితాయి కాకపోతే వారం చివరలో వాటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

 


మీన రాశి
ఈ వారం మొత్తంమీద స్వల్ప అనారోగ్యం కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది.ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వాటి మూలన గత కొంత కాలంగా ఆగిఉన్న పనులను పూర్తిచేయగలుగుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి కొత్త కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. కళారంగం పట్ల మక్కువ పెరుగుతుంది వాటికి సమయం ఇస్తారు. వివాదాలకు దూరంగా ఉండుట అనేది సూచన నిదానం అవసరం.
శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Keloids | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)