Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee-e vee

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం(02-01-2015 నుండి 08-01-2015 వరకు) - -శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద మాటలను జాగ్రత్తగా వాడుట సూచన. తలపెట్టిన పనుల విషయంలో సరైన అవగహన లేకపోతే నూతన సమస్యలు కలుగుతాయి జాగ్రత్త. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి వివాదాలకు దూరంగా ఉండుట సూచన. కుటుంబంలో మీరుతీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు అవకాశం ఇస్తాయి. పూజాదికార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. స్త్రీలకు సంభందించిన వ్యవహరాల్లో నిదానంగా వ్యవహరించుట మంచిది. వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు కలుగుతాయి కాకపోతే పెట్టుబడులు కాకుండా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది.

వృషభ రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను మిత్రుల సహకారంతో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. మీయొక్క మాటతీరు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే విషయంలో మి ఆలోచనలను తరచి చూసుకోవడం వలన వేలుజరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలకు అవకాశం ఉంది వాటివిషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. విందులలో పాల్గొనే అవకాశం ఉంది నచ్చినవారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. పెద్దలసూచనలు పాటించుట మంచిది. ఆచారవ్యవహారాల పట్ల మక్కువను ప్రదర్శిస్తారు.  వ్యాపారస్థులకు వేచిచూసే దోరణి అవసరం అలాగే అనుభవజ్ఞుల సూచనలు పాటించుట ఉత్తమం.

మిథున రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలు చేసేవిషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంభసభ్యుల నుండి నూతన విషయాల గురుంచి చర్చలు జరుగుటకు అవకాశం కలదు ఈ విషయంలో నలుగురిఆలోచనలు అలాగే అభిప్రాయలను తెలుసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మాటలను ఇతరులకు ఇబ్బంది కలిగేలా వాడకండి ఆచితూచి వ్యవహరించుట మంచిది. మాటలు జాగ్రత్తగా మాట్లాడుట అతిఉత్సహమ్ చూపకపోవడం అనేది సూచన. పెద్దల నుండి వచ్చిన సమాచారం ప్రకారం నడుచుకోండి సొంతఆలోచనలకు దూరంగా ఉండుట ఉత్తమం. మీ ఆలోచనలకు వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఇబ్బంది తప్పదు పెట్టుబడులు పెట్టకండి.

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద బంధుమిత్రులసహకారంతో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి ఆశించిన విధంగా సహకారం అందుటవలన చాలావరకు సమస్యలు తొలగిపోవుటకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుంది సర్దుబాటు విధానం చాలావరకు మేలుచేస్తుంది. ప్రయాణాల మూలాన అలసి పోయే అవకాశం ఉంది వీలయితే వాయిదా వేయుట మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పకపోవచును. ఉద్యోగులకు పనివిషయంలో అశ్రద్ధ ఏర్పడే అవకాశం ఉంది దానిమూలన నష్టపోయే ప్రమాదం కలదు జాగ్రత్త. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి అనవసరపు విషయాలకు దూరంగా ఉండుట ఉత్తమం.

సింహ రాశి : ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. సంతోషకరమైన వార్తను వింటారు కుటుంబంలో తీసుకొనే నిర్ణయం చక్కటి మార్పులకు శ్రీకారం చుడుతుంది. మాటపట్టింపులకు పోకండి నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన కొత్త విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. మాటతీరును మార్చుకోవడం వలన మేలుజరుగుతుంది నిదానం అవసరం. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు ఆలోచనలను వారితో పంచుకొనే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో బాగానే ఉంటుంది, వ్యాపారస్థులకు కలిసివచే కాలం పెట్టుబడులు అనుకూలిస్తాయి కాకపోతే అందరిని కనిపెట్టుకొని ఉండుట మంచిది.

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద విదేశీప్రయత్నాలు ఒక ఆశావహ వాతావరణాన్ని కలుగజేయుటకు అవకాశం ఉంది ప్రణాళికా అవసరం. మిత్రులనుండి మీరు సేకరించిన సమాచారం చక్కగా ఉపయోగపడుటకు అవకాశం ఉంది. కుటుంభంలో అనుకోని ఖర్చులు కలిగినను లాభం ఉంటుంది కావున అందరితో మీ ఆలోచనలు పంచుకొనుట అనేది మంచిది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు మరు . ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కొంత శ్రమను పెంచు ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. ప్రయత్నాలలో బాగుంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు కలిగిఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది.

తులా రాశి  : ఈవారం మొత్తంమీద అనారోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నూతన ఇబ్బందులు కలుగుతాయి. ఆలోచనలు అదుపులో ఉంచుకొనుట అనేది సూచన పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకోవడం అనేది సూచన. మీయొక్కమాటతీరు మార్చుకోవడం అనేది మంచిమార్పులకు అవకాశం ఇస్తుంది పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీలోఅసంతృప్తి పెరుగుటకు అవకాశం ఉంది తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కుటుంభంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది.  వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పాటించుట చేత లబ్దిని పొందుతారు.  ఖర్చులు కూడా పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనుట వలన మేలుజరుగుతుంది.

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనుల విషయంలో ఊహించని ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. కలలను సాకారం చూసుకోవాలంటే చాలాకష్టపడాలి అన్న విషయానికి మీయొక్క ఆలోచనలు చేరుతాయి. ప్రయత్నం పెంచుట వలన మేలుజరుగుతుంది పెద్దల నుండి వచ్చు సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. బంధుమిత్రుల నుండి ఊహించని సమాచరం పొందుతారు.   ఆరోగ్యం,ఆర్థికం విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు చేపట్టుట మంచిది. ప్రయాణాల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. సమయాన్ని వృధాచేయక సరిగా ఉపయోగిచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. తొందరపాటు నిర్ణయాలు వద్దు నేల విడిచి సాము చేయకండి.

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద సామాజికకార్యక్రమాల పట్ల చక్కటి అవగాహన కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వార మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి గట్టిగా ప్రయత్నం చేయుట ద్వారా మేలుజరుగుతుంది. వ్యతిరేకవర్గం నుండి వచ్చు ఇబ్బందులు దైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు,కాకపోతే సమయపాలన లేకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు ధనమునకు సంభందించిన విషయాల్లో లాభం ఉంటుంది పనిభారం తప్పదు. దూరదృస్టి ఉంటె తప్పక అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

మకర రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలు వాయిదావేయుట సూచన. వాహనముల విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. నూతన వాహనములు కొనాలనే మీ ఆలోచనలను వాయిదావేయుట మంచిది. ఒకవార్త మీలోనూతన ఆలోచనలను కలుగజేస్తుంది వాటికి సమయం ఇవ్వుట అనేది మంచిది. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి ఉద్యోగంలో మాత్రం నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. తలపెట్టిన పనులకు సంభందించిన విషయాల్లో చివరలో పొందుతారు. ఉత్సాహంతో పనులను చేపడుతారు. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు కొత్త కొత్త ఆలోచనలు ఉండే అవకాశం ఉంది.

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో ఊహించని వాతావరణం వలన మార్పులకు అవకాశం ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోండి. చాలావరకు కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో మీయొక్క అనుభవం మీకు చాలాఉపయోగపడుతుంది నలుగురికి సహపడే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. విందులలో పాల్గొనే అవకాశం ఉంది సమయాన్ని వాటికి ఇచ్చే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. అధికమైన ఆలోచనలు కలిగి కొంత అసహనాన్ని పొందుటకు అవకాశం ఉంది. పనులకు సంబంధించిన విషయాల్లో ఒకింత శ్రద్దఅవసరం.

మీన రాశి : ఈవారం మొత్తంమీద స్వల్పదూరప్రయాణాలు చేయుట యందు మక్కువను కలిగి ఉంటారు. నూతన బంధుత్వాలు ఏర్పడుటకు అవకాశం కలదు వారితో సమయాన్ని గడుపుతారు. దైవసంభందమైన విషయలకు ప్రాధాన్యత ఇస్తారు. మీలోకొంత నూతన సంఘర్షణలు మొదలుఅవుటకు అవకాశం ఉంది వాటి విషయంలో నూతన ఆలోచనలకు అవకాశం ఉంది. తలపెట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చుటకు అవకాశం ఉంది.  చిన్న చిన్న విషయాల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. భోజనం విషయంలో సంతృప్తి ఉంటుంది,విందులలో పాల్గొంటారు.  వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది.
 

శ్రీకాంత్
-వాగ్దేవి జ్యోతిషాలయం

 

మరిన్ని శీర్షికలు
vantillu