Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

బాబాయ్‌, అబ్బాయ్‌ పోటాపోటీ

competetion between babai and abbaai

‘నేను కొడితే హిస్టరీలో కనిపిస్తుంది’ అని బాలకృష్ణ అంటే, ‘దయాగాడి దండయాత్ర’ అని ఎన్టీఆర్‌ నందమూరి అభిమానుల్ని అలరించాడు. న్యూ ఇయర్‌లో నందమూరి అభిమానులకు బాలకృష్ణ ‘లయన్‌’ టీజర్‌, ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ టీజర్‌ జోష్‌ తీసుకొచ్చాయి. టీజర్స్‌లో ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. రెండూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తోనే ఉన్నాయి.బాలకృష్ణతో కొత్త దర్శకుడు సత్యదేవా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లయన్‌’. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. బాలకృష్ణ ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్స్‌ టీజర్‌కి హైలైట్‌గా ఉన్నాయి. సినిమాలో బాలకృష్ణని దర్శకుడు చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నాడట. చాలా టైటిల్స్‌ అనుకుని, చివరకు ‘లయన్‌’ని కన్‌ఫర్మ్‌ చేశారు.‘టెంపర్‌’ మూవీ దగ్గరకు వస్తే, పూరి జగన్నాథ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. పూరి జగన్నాథ్‌ సినిమాల్లో హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో అందరికీ తెలుసు. పోలీస్‌ గెటప్‌లో ఎన్టీఆర్‌ని, తన మార్క్‌ మేనరిజమ్స్‌తో పూరి ‘టెంపర్‌’లో చూపించబోతున్నాడు. ‘దయాగాడి దండయాత్ర’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్‌కి ఫాన్స్‌ ఊగిపోతున్నారు.‘లయర్‌’, ‘టెంపర్‌’ టీజర్స్‌తో బాబాయ్‌, అబ్బాయ్‌ పోటాపోటీగా న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ అభిమానులకు ఇచ్చారు.

మరిన్ని సినిమా కబుర్లు
tollywood young hero dedication