Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
competetion between babai and abbaai

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌ యంగ్‌ హీరో డెడికేషన్‌

tollywood young hero dedication

సినీ హీరో అవడం సినీ కుటుంబాల్లోని కొత్త జనరేషన్‌కి ఓ డ్రీమ్‌. ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్‌ చేసుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క సినిమాతో ఎంట్రీ దక్కడమే గొప్ప అనుకోవడంలేదు నేటి సినీ కుర్రాళ్ళు. తొలి సినిమా కోసం మాత్రమే కాకుండా, సినీ రంగంపై గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన యంగ్‌ హీరోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.ఫస్ట్‌ మూవీ ‘అల్లుడు శీను’లో డాన్స్‌, ఫైట్స్‌, నటనలో టాలెంట్‌ చూపించాడు ఈ యంగ్‌ హీరో. వినాయక్‌ డైరెక్షన్‌లో తొలి మూవీ చేసిన సాయి శ్రీనివాస్‌, రెండో సినిమాని బోయపాటి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. రెండో మూవీ కోసం శరీరాన్ని ఇంకా కష్టపెడుతున్నాడట. సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా ఉండేందుకు కండలు తిరిగిన శరీరాన్ని సంపాదించుకున్నానని సాయి శ్రీనివాస్‌ చెప్పాడు.తండ్రి పెద్ద నిర్మాత కావడంతో, పెద్దగా కష్టపడకుండా హీరో అయిపోయే ఛాన్స్‌ ఉంది సాయి శ్రీనివాస్‌కి. కానీ, కష్టపడితేనే సినీ రంగంలో గుర్తింపు వస్తుందని భావించి, సినిమా సినిమాకీ కష్టపడుతున్న సాయి శ్రీనివాస్‌ని అభినందించాల్సిందే. పెద్ద దర్శకులతోనే కాకుండా, కొత్త దర్శకులతోనూ పనిచేస్తానని సాయి శ్రీనివాస్‌ మనసులో బయట పెట్టాడు. ఆల్‌ ది బెస్ట్‌ సాయి శ్రీనివాస్‌.

మరిన్ని సినిమా కబుర్లు
get success brother's movie