Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
get success brother's movie

ఈ సంచికలో >> సినిమా >>

‘కార్తికేయ’ ఫ్లేవర్‌తో ‘సూర్య వర్సెస్‌ సూర్య’

surya vs surya with kartikeya flavour

కార్తికేయ’ సినిమాతో డీసెంట్‌ కమర్షియల్‌ హిట్‌ కొట్టాడు యంగ్‌ హీరో నిఖిల్‌. చిన్న సినిమాలకి పెద్ద హీరోలా మారిన నిఖిల్‌ కొత్త సినిమా ‘సూర్య వర్సెస్‌ సూర్య’ ఫస్ట్‌ లుక్‌ న్యూ ఇయర్‌ సందర్భంగా విడుదల చేశారు. న్యూ లుక్‌ని డిఫరెంట్‌గా తీర్చిదిద్దారు. కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌తో ‘సూర్య వర్సెస్‌ సూర్య’ని దర్శకుడు రూపొందిస్తున్నాడట. చిత్రమేంటంటే ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రానికి దర్శకుడైన కార్తీక్‌ ఘట్టమనేని ‘కార్తికేయ’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఇంకా చిత్రమైన అంశం, ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి, ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రానికి సంభాషణల్ని రాయడం.డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో, ఎంటర్‌టైనింగ్‌గా, సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌తో ‘సూర్య వర్సెస్‌ సూర్య’ ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర దర్శకుడు చెప్పాడు. తన కెరీర్‌లో ‘కార్తికేయ’ పెద్ద కమర్షియల్‌ హిట్‌ అనీ, దానికన్నా పెద్ద హిట్‌ ‘సూర్య వర్సెస్‌ సూర్య’ అవుతుందని నిఖిల్‌ ధీమాగా ఉన్నాడు. త్రిదా చైదరి, నిఖిల్‌ సరసన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
like krishnarjunas