Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

Happy Sankranthi

సైలెంట్‌గా హిట్స్‌ కొడ్తున్న యువ హీరో

hero with silent hits
‘సామిరారా’ అన్నాడు, ‘కార్తికేయ’ అన్నాడు. రెండూ హిట్‌ సినిమాలే. అంతకు ముందు వచ్చిన ఫ్లాపుల్ని మరిచిపోయి కొత్తగా ఆలోచిస్తూ, కొత్త జోనర్‌లో సినిమాలు చేస్తున్న యంగ్‌ హీరో నిఖిల్‌ ఇంకో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే ‘సూర్య వర్సెస్‌ సూర్య’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుందట. శేఖర్‌ కమ్ముల ‘హ్యాపీడేస్‌’తో పరిచయం చేసిన హీరోల్లో నిఖిల్‌ ఒకడు. మాస్‌ సినిమాలు ట్రై చేసినా ఫెయిల్యూర్స్‌ రావడంతో కొత్త బాటలో ప్రయోగాత్మక చిత్రాలకు శ్రీకారం చుట్టాడు. వరుస హిట్లు అందుకుంటున్న నిఖిల్‌, ‘కార్తికేయ’తో పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ రుచి చూశాడు. దానికన్నా పెద్ద హిట్‌గా ‘సూర్య వర్సెస్‌ సూర్య’ వుంటుందని నిఖిల్‌ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు.

తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేయాలనే ఆలోచన నుంచి దూరంగా జరుగుతున్నారు కొందరు యువ హీరోలు. తమకు నప్పే సినిమాలు చేయడం ద్వారా హీరోగా తమ స్థానాన్ని సినీ పరిశ్రమలో పదిలం చేసుకుంటున్న కొద్దిమంది యంగ్‌ హీరోల్లో నిఖిల్‌ కూడా స్థానం దక్కించుకున్నాడు. గో ఎహెడ్‌ విత్‌ సక్సెస్‌ ఫుల్‌ కెరీర్‌ నిఖిల్‌.
మరిన్ని సినిమా కబుర్లు
technical movie from lady director jaya