Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
'gajal' drama competetions in palakollu

ఈ సంచికలో >> సినిమా >>

Happy Sankranthi

త్రిష పెళ్ళి బాజాలు మోగనున్నాయి

trisha marriage soon
చిరంజీవితో ‘స్టాలిన్‌’, నాగార్జునతో ‘కింగ్‌’, వెంకటేష్‌తో ‘నమో వెంకటేశ’ సినిమాలు చేసిన త్రిష బాలకృష్ణతో ‘లయన్‌’ సినిమా చేస్తోంది. తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించిన త్రిష, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు పెళ్ళి కబురు తెలియజేసింది. మహేష్‌తో ‘అతడు’, ప్రభాస్‌తో ‘వర్షం’, పవన్‌కళ్యాణ్‌తో ‘తీన్‌మార్‌’ ఇలా తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు ప్రముఖ హీరోలందరితోనూ నటించిన త్రిష, తమిళంలో కూడా పలువురు అగ్రహీరోలతో నటించి స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది.

షడెన్‌గా పెళ్లి కబురు త్రిష చెప్పడం ఆశ్చర్యం కలిగించినా, అంతకన్నా ఆశ్చర్యం కలిగించే అంశం పెళ్ళయ్యాక త్రిష సినిమాలు చేసే అవకాశం లేదని తెలియడం. ఈ నెలాఖరున వరుణ్‌ మనియన్‌ అనే నిర్మాతతో త్రిష ఎంగేజ్‌మెంట్‌ జరగనుంది. పెళ్ళి కూడా అతి త్వరలోనే చేసుకోవడానికి త్రిష నిర్ణయం తీసుకుందట. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత పెళ్ళి తేదీపై త్రిష ప్రకటించనుందని తెలుస్తున్నది. కొన్ని రోజులనుంచి త్రిష, వరుణ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. మొన్నటివరకూ వరుణ్‌తో ప్రేమ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, అదేం లేదని చెప్పిన త్రిష, వరుణ్‌ని పెళ్ళాడుతున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. సినీ తారలకు ఇది మామూలే. స్నేహ, రంభ తదితర హీరోయిన్లూ ఇలానే ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆల్‌ ది బెస్ట్‌ త్రిష.
మరిన్ని సినిమా కబుర్లు
jagapathi is great actor