Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
trisha marriage soon

ఈ సంచికలో >> సినిమా >>

Happy Sankranthi

జగపతి గ్రేట్‌ యాక్టర్‌

jagapathi is great actor
ఫ్యామిలీ చిత్రాల హీరో జగపతిబాబు ‘లెజెండ్‌’ సినిమాలో విలన్‌గా కనిపించి అలరించాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలోనూ నెగెటివ్‌ రోట్‌లో కనిపించి మెప్పించాడు. నటుడు అన్నాక విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రేక్షకుల్ని మెప్పించాలని, ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ లాంటి మేటి నటులు నిరూపించారు.
హీరోగానే చెయ్యాలి, విలన్‌గానే కనిపించాలి లాంటి లిమిట్స్‌ పెట్టుకోకుండా మంచి పాత్రల్ని ఎంచుకుని మరీ సినిమాలు చేస్తున్న జగపతిబాబు నిజంగా అభినందనీయుడు. విడుదలకు సిద్ధమైన ‘హితుడు’ అనే సినిమాలో జగపతిబాబు అద్భుతమైన పాత్ర పోషించాడు. సినిమాని కొందరు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శన వేస్తే, సినిమా చూసినవారంతా జగపతిబాబు నటనకు హేట్సాఫ్‌ చెప్పారు.
తెలుగు సినిమాలోకి అచ్చమైన తెలుగు విలన్‌ల కొరత ఉండడంతోనే జగపతిబాబుని ఆ పాత్రలకు ఎంచుకుంటున్నారు. అలాగే, మంచి నటుల కొరత కూడా ఉంది తెలుగు సినీ పరిశ్రమకి. కొత్త కథలతో సినిమాలు వస్తే, కొత్త కొత్త పాత్రలతో దర్శకులు ముందుకొస్తే, జగపతిబాబు బెస్ట్‌ ఆప్షన్‌. నటుడిగా కొత్తగా జగపతిబాబు ప్రూవ్‌ చేసుకోవాల్సిందేమీ లేదు. కానీ మంచి సినిమాలకు మంచి మంచి పాత్రలకు జగపతిబాబు అవసరం ఉంది.
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam