Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం(16-01-2015 నుండి 22-01-2015 వరకు) - -శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద మొదట్లో పనిఒత్తిడి ఉండుటకు అవకాశం కలదు అలాగే స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆస్కర్జం కలదు కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. బంధుమిత్రులతో సమాలోచనలు చేయుటకు ఆస్కారం కలదు వారినుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకొనే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు చేయుట మూలాన శ్రమను పొందుతారు. అధికారులతో కలిసి నూతన పనులను చేపడుతారు ఉద్యోగంలో వారితో కలిసి నూతన చర్చలు చేయుటకు అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది. పెట్టుబడులకు సంభందించి తీసుకొనే మీ నిర్ణయాలు బాగానే ఉంటవి కాకపోతే ఏకపక్షంగా ఉండకపోవడం వలన మరింత మేలుజరుగుతుంది.

వృషభ రాశి : ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులకు సంభందించి అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటూనే ముందుకు వెళ్ళుటకు ప్రయత్నం చేస్తారు. నలుగురికి ఉపయోగపడాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుటకు అవకాశం ఉండ. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన దృష్టిని సారించుట మంచిది. తలపెట్టిన పనులకు సంభందించి మంచి పేరును పొందుతారు అలాగే పెద్దల అభిప్రాయాలు గౌరవించుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో  నిర్ణయాలు నూతన మార్పులకు అవకాశం ఇచ్చే పరిస్తితి కలుగుతుంది. చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేస్తారు అలాగే వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

మిథున రాశి :  ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వార ఉత్సాహంతో ముందుకువెళ్ళుటకు ఆస్కారం కలదు. కుటుంబసభ్యులతో కలిసి చేయుప్రయత్నాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చును సర్దుకుపోవడం మంచిది. చేపట్టిన పనుల మూలాన అనుకున్న దానికన్నా అధికమైన ఖర్చులు అవుతాయి. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తలు తీసుకోండి అశ్రద్ద వద్దు. ఉద్యోగులకు అధికారులతో మాటను పడవలసి వస్తుంది కావున ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతిపనిలో నిదానం అవసరం. వ్యాపారస్థులకు పనులు పెరుగుతాయి ఆర్థికపరమైన విషయాల్లో డబ్బులు సమయానికి సర్దుబాటు అవడం సంతొషించ తగిన విషయం.

కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు వాటికి అధికమైన సమయం ఇస్తారు. చాలావరకు నూతన విషయంలో ప్రయోగాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేస్తారు వారినుండి అభినందనలు పొందుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనలు నలుగురికి ఉపయోగపడుతాయి. జీవితభాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త అవసరం లేకపోతే వారివిషయంలో ఆందోళన తప్పకపోవచ్చును ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పనిసరి. వ్యాపారస్థులకు బాగుంటుంది చేపటిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు  వలన మేలుజరుగుతుంది,ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. 

సింహ రాశి : ......ఈ వారం మొత్తంమీద సోదరవర్గంతో చర్చలు జరుపుటకు అవకాశం కలదు ఈ విషయంలో మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల మూలాన ఖర్చులు పెరుగుతాయి అలాగే స్వల్ప ఆటంకాలు ఏర్పడుతకు అవకాశం కలదు. కుటుంబంలో మాత్రం పెద్దల లేదా అనుభవజ్ఞుల సూచనలు పాటించుటకు ప్రయత్నం చేయుట మంచిది. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు వాటికి సరైన సమయం ఇవ్వడం సూచన. చేపట్టు పనులకు సంభందించిన విషయాల్లో ప్రణాలిక అవసరం. సమయం విషయంలో సరైన ఆలోచనలు చేయుట ద్వార పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తించుట మూలాన మిత్రులకు ఇబ్బందులు తప్పకపోవచ్చును

కన్యా రాశి :ఈ వారం మొత్తంమీద నచ్చిన వారితో చర్చల్లో పాల్గొంటారు. ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇవ్వడం చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు భోజనసౌఖ్యంను కలిగిఉంటారు.ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో గల సత్సంభందాలు మేలుచేస్తాయి. నూతన అవకాశాలకు చేసిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. పెట్టుబడులకు సంభందించిన విషయాల్లో మాత్రం అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. అనుకున్న ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం కలదు కొన్ని కొన్ని విషయాల్లో వేచిచూసే దొరని మేలుచేస్తుంది. దూరప్రదేశం నుండి చాలాకాలంగా ఎదురుచూస్తున్న విషయంలో వార్తను వింటారు.

తులా రాశి : ఈవారం మొత్తంమీద సమయాన్ని వృధాచేసే అవకాశం కలదు జాగ్రత్త. మాటపట్టింపులకు పోకండి సర్దుబాటు తప్పక మేలుచేస్తుంది. పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తారు నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. శ్రమను కలిగి ఉంటారు బద్ధకం వీడి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళుటవలన మేలుజరుగుతుంది.  ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి,తొందరపాటు వద్దు చిన్న చిన్న పనులను పూర్తిచేసే ప్రయత్నం మొదలు పెట్టుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది పెద్దలనుండి గుర్తింపును పొందుతారు అదేవిధంగా వారిసూచనలు పాటించుట చేయండి. మిత్రులనుండి నూతన సమాచరం అందుతుంది వాటి విషయంలో బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.

వృశ్చిక రాశి : ఈ వారం మొత్తంమీద చిననాటి మిత్రులను కలుస్తారు,మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. వినోదాలకు సమయం ఇస్తారు. నూతన ప్రయత్నాలు చేయక గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును నిదానంగా వ్యవహరించుట వారికి దూరంగా ఉండుట మంచిది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది కాకపోతే అధికారులతో సత్సంభందాలు ఏర్పడువిధంగా ప్రయత్నాలు చేయండి లేకపోతే చిన్న చిన్న సమస్యలు తప్పవు. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు పెరుగుతాయి అలాగే గతంలో చేపట్టిన పనుల వలన లాభం పొందుతారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట చాలావరకు మేలుచేస్తుంది.

ధనస్సు రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో కొంతమేర పనుల ఒత్తిడి మూలాన చికాకును కలిగి ఉంటారు. పనులకు సంభందించిన విషయాల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగించే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. విశ్రాంతిని కోరుకుంటారు కాస్త సమయాన్ని ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయుట మంచిది. సమయానికి భోజనం చేయుటకు ప్రయత్నం చేయండి.ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం బాగుంటుంది రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. రాజకీయపరమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. పెద్దలను కలుస్తారు వారినుండి నూతన అవకశాలు పొందుటకు అవకాశం కలదు.

మకర రాశి : ......ఈ వారం మొత్తంమీద కుటుంబసబ్యులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది సమయాన్ని మీకు నచ్చినవిధంగా ఉపయోగిస్తారు. బంధుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. కాకపోతే వారితో కలిసి నూతన వ్యాపారప్రయత్నాలు చేయకండి మంచిది . ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరిగనను ఇబ్బందులు ఉండవు అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు లబ్ది కలుగుతుంది. వ్యాపారస్థులు మాత్రం మాటవిషయంలో నిదానం వ్యవహరించుట అవసరం వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచది. జీవితభాగస్వామి నుండి చాలావిలువైన విషయం లేదా సహాయం అందుటకు ఆస్కారం కలదు.

కుంభ రాశి : ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు అలాగే నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుతారు. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం మూలాన మేలుజరుగుతుంది. కుటుంబపెద్దతో చర్చలు చేయునపుడు నిదానం అవసరం లేకపోతే మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు. ఉద్యోగులకు స్థిరమైన ఆలోచనలు చేసినచో మేలుజరుగుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో మీకు అకారణంగా కోపం పెరుగుటకు అవకాశం కలదు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి వివదాలకు దూరంగా ఉండే ప్రయత్నం మేలు. మిత్రులతో కలిసి నూతన చర్చలలో పాల్గొంటారు.

మీన రాశి : ఈ వారం మొత్తంమీద భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కనభరుస్తారు భోజనసౌఖ్యం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమపెరుగుతుంది వాటిని ప్రణాళికా బద్దంగా ముందుకువెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి కొత్త కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. ప్రయాణాలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చును కావున వాయిదావేయుట మంచిది.  ఉద్యోగులకు అధికారుల మూలాన కొంత శ్రమపెరుగుతుంది ఇబ్బందులు తప్పవు. దూరప్రదేశం నుండి నూతన వార్తలను వింటారు. వ్యాపారస్థులకు కొంత నిదానం అవసరం సమయానుకూలంగా నడుచుకోండి లేకపోతే మిత్రులతో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. వాహనముల మూలాన స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. 

మరిన్ని శీర్షికలు
natyabharateeyam