Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం:
తారాగణం: విక్రమ్‌, అమీ జాక్సన్‌, ఉపేన్‌ పటేల్‌, రామ్‌కుమార్‌ గణేశన్‌, సురేష్‌ గోపి, సంతానం తదితరులు
చాయాగ్రహణం: పిసి శ్రీరామ్‌
సంగీతం: ఎఆర్‌ రెహమాన్‌
నిర్మాణం: ఆస్కార్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
దర్శకత్వం: శంకర్‌
నిర్మాత: వేణు రవిచంద్రన్‌
విడుదల తేదీ: 14 జనవరి 2015

క్లుప్తంగా చెప్పాలంటే
మోడల్‌గా విశేషమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న దియ (అమీ జాక్సన్‌) పెళ్ళి జరుగుతుండగా, ఓ వికృతమైన వ్యక్తి ఆమెను కిడ్నాప్‌ చేస్తాడు. ఆ వికృతమైన వ్యక్తి మరో ఫేమస్‌ మోడల్‌ జాన్‌ (ఉపేన్‌ పటేల్‌)ని, డాక్టర్‌ వాసుదేవన్‌ (సురేష్‌ గోపి), స్టైలిస్ట్‌ ఒసామా జాస్మిన్‌నీ, బిజినెస్‌మేన్‌ ఇంద్రకుమార్‌ (రామ్‌కుమార్‌ గణేషన్‌)నీ చంపాలనుకుంటాడు. ఎవరీ వికృతమైన వ్యక్తి? ఎందుకు దియాని కిడ్నాప్‌ చేశాడు? మిగతా వ్యక్తుల్ని చంపాలని ఎందుకు అనుకుంటాడు? అనేది తెరపై చూడాల్సిన కథ.

మొత్తంగా చెప్పాలంటే
అందరూ ఊహించినట్లుగానే విక్రమ్‌ భిన్నమైన గెటప్స్‌తో కనిపించి మెప్పించాడు. తెరవెనుక అతను పడ్డ కష్టం తెరపై కనిపించింది. గెటప్స్‌తోనే కాకుండా హావభావాలతోనూ ఆకట్టుకున్నాడు విక్రమ్‌. విక్రమ్‌ తప్ప ఇంకెవరూ ఈ సినిమా చేయలేరన్నంతగా విక్రమ్‌ ప్రతి సీన్‌లోనూ అద్భుతంగా పెర్ఫామ్‌ చేశాడు. కురూపిగా, సూపర్‌ మోడల్‌గా, డిఫరెంట్‌ గెటప్స్‌లో డిఫరెంట్‌ ఆహార్యాలతో విక్రమ్‌ అద్భుతంగా చేశాడు. క్యూట్‌గా, హాట్‌గా కనిపించిన హీరోయిన్‌ అమీ జాక్సన్‌, అవసరమైన చోట్ల క్లాస్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఆమె గ్లామర్‌, ఆమె అప్పీయరెన్స్‌ సూపర్బ్‌.

ఉపేన్‌ పటేల్‌ ఓకే. సురేష్‌ గోపి తన పాత్రకు న్యాయం చేశాడు. సంతానం నవ్వించాడు. రామ్‌కుమార్‌ గణేషన్‌ మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అనిపించారు.

డిఫరెంట్‌ స్టోరీ లైన్‌ని ఎంచుకున్న దర్శకుడు, కెమెరా, మ్యూజిక్‌ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్‌నీ సరిగ్గా వినియోగించుకుని సినిమాకి రిచ్‌ లుక్‌ని తెచ్చాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రీన్‌ప్లే బావుంది. నెరేషన్‌ ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. పాటలు తెరపైనా చూడ్డానికి అందంగా వున్నాయి. కాస్ట్యూమ్స్‌ క్రయేటివ్‌గా వున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మైండ్‌ బ్లోయింగ్‌. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా బాగున్నాయి. శంకర్‌ సినిమాల్లో వుండాల్సిన రిచ్‌నెస్‌ అంతా వుంది. ఎడిటింగ్‌ కొన్ని సీన్స్‌లో వీక్‌గా వుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఐ’ సినిమా టెక్నికల్‌గా అంచనాల్ని అందుకుంటుందేమోగానీ, శంకర్‌ మార్క్‌ కథ, కథనాల విషయంలో అంచనాల్ని అందుకోవడంలో జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కనిపిస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో ఎమోషనల్‌ ఇంటెన్సిటీ ఎక్కువైంది. లెంగ్త్‌ ఎక్కువగా వుండడం ఇబ్బందికరంగా మారింది. శంకర్‌ సినిమాపై సహజంగా ఉండే అంచనాలతో ఫస్ట్‌ డే ఓపెనింగ్స్‌ చాలా బాగున్నాయి.భారీ చిత్రాలు తీయడంలో శంకర్‌ దిట్ట. ఆ భారీ తనాన్ని శంకర్‌ ఈసారి కూడా నమ్ముకున్నాడు. అయితే ప్రేక్షకులు తననుంచి భారీ తనంతోపాటు వైవిధ్యాన్నీ, కథా బలం ఉన్న సినిమాల్నీ ఆశిస్తున్నారన్న విషయాన్ని శంకర్‌ కాస్త విస్మరించాడు ‘ఐ’ సినిమా విషయంలో. తన సినిమాపై వుండే అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు తీసే శంకర్‌, ఈ సినిమా విషయంలో కొంచెం డౌన్‌ అయ్యాడేమో అనిపిస్తుంది. టెక్నికల్‌ వాల్యూస్‌ మీద దృష్టిపెట్టిన శంకర్‌, ఈసారి మిగతా అంశాలపై పెద్దగా ఫోకస్‌ పెట్టకపోవడం మైనస్‌. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కోసం, విక్రమ్‌ పడ్డ కష్టం కోసం సినిమా ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే.

ఒక్క మాటలో చెప్పాలంటే
విక్రమ్‌ వన్‌ మాన్‌ షో

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka