Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
how would

ఈ సంచికలో >> సినిమా >>

మహా మాస్‌ ‘పండగ’

maha mass celebrations

‘బాణం’ హీరో నారా రోహిత్‌ ‘పండగలా వచ్చాడు’ సినిమా ఫస్ట్‌ లుక్‌తో అభిమానుల్ని అలరించాడు ఈ సంక్రాంతికి. చేసే ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని కోరుకునే హీరోల్లో నారా రోహిత్‌ ముందు వరుసలో ఉంటాడు. ‘సోలో’, ‘ప్రతినిథి’ ఇలా ఏ సినిమా చేసినా, వైవిద్యభరితమైన కథాంశాల్ని ఎంచుకునే నారా రోహిత్‌, ఈసారి మాస్‌ బాట పట్టాడు.‘పండగలా వచ్చాడు’ ఫస్ట్‌ లుక్‌తో సినీ ఇండస్ట్రీ దృష్టిని తన సినిమా వైపుకు తిప్పుకోవడంలో నారా రోహిత్‌ సఫలమయ్యాడు. లుంగీ కట్టి తాను మహా మాస్‌ అనిపంచుకున్నాడు నారా రోహిత్‌. వైవిధ్యమే కాదు, తనలోని మాస్‌ హీరో కూడా ఉన్నాడని ఈ యంగ్‌ హీరో ఈ సినిమాతో నిరూపించుకుంటాడట.అరన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై, నారా రోహిత్‌ సమర్పణలో రానుంది ‘పండగలా వచ్చాడు’ మూవీ. యాక్షన్‌ సీన్స్‌లో రాణిస్తున్న నారా రోహిత్‌, ఈ సినిమాలో డాన్సులు కూడా చేసి అభిమానుల్ని అలరిస్తాడట. అవి కూడా మాస్‌ డాన్సులట. ఆల్‌ ది బెస్ట్‌ నారా రోహిత్‌.

మరిన్ని సినిమా కబుర్లు
powerstar towards family oriented