Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
maha mass celebrations

ఈ సంచికలో >> సినిమా >>

ఫ్యామిలీ బాట పట్టిన పవన్‌కళ్యాణ్‌

powerstar towards family oriented

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ‘గోపాల గోపాల’ మూవీతో ఇంకో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. తదుపరి ‘గబ్బర్‌సింగ్‌`2’ మూవీ కోసం సన్నద్ధమవుతున్న పవన్‌కళ్యాణ్‌, ఈ సినిమాలో సూపర్‌ మాస్‌ లుక్‌తో కనిపించనున్నారనే విషయం అందరికీ తెలిసినదే. ‘గబ్బర్‌సింగ్‌’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకోనుంది.‘గబ్బర్‌సింగ్‌`2’ తర్వాత పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో చేస్తాడట. ‘అత్తారింటికి దారేది’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న మూవీ ఇదే. ఇది కూడా ‘అత్తారింటికి దారేది’లా ఫ్యామిలీ మూవీ అని ఇండస్ట్రీలో గాసిప్స్‌ వస్తున్నాయి. ఇంకో వైపున ‘గోపాల గోపాల’ ఫేం డాలీ (కిషోర్‌ కుమార్‌ పార్దసాని)తో ఇంకో సినిమా చేయడానికి పవన్‌ సిద్ధంగా ఉన్నాడు. డాలీతో ఇంకో సినిమా చేస్తానని పవన్‌ ఇప్పటికే ప్రకటించి ఉన్నాడు. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే సినిమాయేనట.టాలీవుడ్‌లో ట్రెండ్‌ మారింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి గిరాకీ పెరిగింది. ‘అత్తారింటికి దారేది’తో ఈ ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన పవన్‌, ఓ మాస్‌ సినిమా, రెండు ఫ్యామిలీ సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
did not failed as actor