Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
did not failed as actor

ఈ సంచికలో >> సినిమా >>

ఆ భయమే స్టార్‌ని చేసింది: అమితాబ్‌

that feel only made me star

తెరపై చూసే ప్రేక్షకులు తమని చాలా హ్యాపీ పర్సన్స్‌ అనుకుంటారనీ, కెమెరా ముందు తాము ఎంత భయపడతామో ప్రేక్షకులకు తెలియదంటారు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. లెజెండ్‌ అమితాబ్‌ ‘షమితాబ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫ్రస్టేషన్‌తో కూడిన వ్యక్తిగా నటించనున్న అమితాబ్‌, ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డానంటూ తన కష్టం గురించి వివరించారు. కెమెరామెన్‌ ఆలోచనలు ఎలా ఉంటాయో, స్క్రిప్ట్‌ ఏం డిమాండ్‌ చేస్తుందో, ప్రేక్షకుల అంచనాల ఎలా ఉంటాయో అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నటించడమంటే చిన్న విషయం కాదన్న అమితాబ్‌, వాటన్నిటినీ బ్యాలన్స్‌ చేయడానికి మానసికంగా ఎంతో సంఘర్షణ పడాల్సి వస్తుందని చెప్పారు.ఎన్నో ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఉన్నా అమితాబ్‌ ఎప్పుడూ రిలాక్స్‌ కాలేదట. పాత్ర కోసం పడే సంఘర్షణ, అంచనాల్ని అందుకోవాలన్న తప్ప, వీటి కారణంగా వచ్చే భయమే తనను స్టార్‌ని చేసి, ఇన్నాళ్ళుగా ఆ స్టార్‌ డమ్‌ని నిలబెట్టిందని అమితాబ్‌ చెబుతారు. అమితాబ్‌ చెప్పింది అక్షర సత్యం. ఇప్పటికి కూడా అమితాబ్‌ బచ్చన్‌ బిగ్‌ స్టార్‌. సూపర్‌ స్టార్‌.

మరిన్ని సినిమా కబుర్లు
prakash raj chandamama rave.com