Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ షష్టిపూర్తి వేడుకలు

మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన చిరంజీవి, 60వ పడిలోకి అడుగు పెడ్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ షష్టి పూర్తి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మెగాస్టార్‌ షష్టిపూర్తి వారోత్సవాలుగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపడ్తారు అభిమానులు. ఆగస్ట్‌ 15 నుంచి 22 వరకూ చేపట్టే కార్యక్రమాల్లో వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులను సన్మానించడం, రక్తదానాలు నిర్వహించడం వంటివి చేస్తారు. ఆగస్ట్‌ 22న చిరంజీవి పుట్టినరోజు. ఇదే రోజున చిరంజీవి నటించబోయే 150వ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలకు మాజరవుతారట. తెలుగు సినీ రంగంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ఉత్సవాల్ని నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ, మెగా ఫాన్స్‌ సమాయత్తమవుతున్నారు. కేంద్ర మంత్రిగా కాంగ్రెస్‌ హయాంలో పనిచేసిన చిరంజీవి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు