Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Naa Paata by lyricist ChandraBose

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - పటాస్

Movie review - patas

చిత్రం: పటాస్‌
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, శృతి సోది, సాయికుమార్‌, అశుతోష్‌ రాణా, ఎంఎస్‌ నారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, జాన్సీ తదితరులు
చాయాగ్రహణం: సర్వేష్‌ మురారి
సంగీతం: సాయి కార్తీక్‌
నిర్మాణం: ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌
విడుదల తేదీ: 23 జనవరి 2015

క్లుప్తంగా చెప్పాలంటే
ఏసీపీ కళ్యాణ్‌ సిన్హా ఓ అవినీతి పోలీస్‌ అధికారి. హైద్రాబాద్‌కి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు కళ్యాణ్‌ సిన్హా. డీజీపీ కృష్ణ ప్రసాద్‌ (సాయికుమార్‌)తో తలెత్తిన చిన్న వివాదాన్ని బేస్‌ చేసుకుని, నొటోరియస్‌ రాజకీయ నాయకుడైన జీకే (అశుతోష్‌ రాణా)తో చేతులు కలుపుతాడు. ఓ సందర్భంలో తాను చేస్తున్న తప్పుల్ని తెలుసుకుని, మారతాడు కళ్యాణ్‌ సిన్హా. ఎవరికి ఇన్నాళ్ళూ అండగా ఉన్నాడో, అదే జీకేకి ఎదురు తిరుగుతాడు. అవినీతి అధికారి, పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా ఎలా రూపాంతరం చెందాడు? అతన్ని అలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? అనేవి తెరపైనే చూసి తెలుసుకోవాలి.

మొత్తంగా చెప్పాలంటే
కళ్యాణ్‌రామ్‌ సినిమాకి అవసరమైనంత మేర పూర్తి ఎనర్జీతో నటించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడతడు. డైలాగ్స్‌ చెప్పడంలోనూ, యాక్షన్‌ సీన్స్‌లోనూ, డాన్సుల్లోనూ అన్ని విభాగాల్లోనూ రాణించాడు. నటన సంగతి పక్కన పెడితే, గ్లామర్‌తో ఆకట్టుకుంది హీరోయిన్‌ శృతి సోది. నటనలో చాలా మెరుగుపడాల్సి వుందామె. కాస్త నటన జోడిస్తే, తెలుగులో హీరోయిన్‌గా స్థిరపడేందుకు అవకాశం వుందామెకి.
సాయికుమార్‌ సూపర్బ్‌గా తనకిచ్చిన పాత్రలో జీవించేశాడు. విలన్‌ పాత్రలో అశుతోష్‌ రాణా విలనిజం పండిరచాడు. ఎమ్మెస్‌ నారాయణ నవ్వులు పూయించారు. శ్రీనివాస్‌రెడ్డి సినిమాకి సంబంధించి కామెడీ డిపార్ట్‌మెంట్‌ని తన భుజాన వేసుకున్నాడు. పోసాని కూడా తనవంతుగా కామెడీతో నవ్వించాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపిస్తారు.

కమర్షియల్‌ ఫార్ములతో, సక్సెస్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌నీ బాగా మిక్స్‌ చేసి కొట్టాడు దర్శకుడు. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ జొప్పించడంతో సినిమా సాఫీగా సాగిపోతుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రిప్ట్‌ ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. ఎడిటింగ్‌ ఓకే. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమా బ్యాక్‌డ్రాప్‌కి తగ్గట్టుగా వున్నాయి. సినిమా రిచ్‌గా కన్పించిందంటే, నిర్మాత ఎక్కడా రాజీ పడకపోవడం వల్లే.

ప్రయోగాలు చేసి కొన్ని సినిమాలతో చేతులు కాల్చుకున్న కళ్యాణ్‌రామ్‌, ఫార్ములా ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు ఈ సారి. కొత్త దర్శకుడితోనే సినిమా చేసినా రిస్క్‌ జోలికి వెళ్ళలేదు. ఫస్టాఫ్‌ యాక్షన్‌, రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరదాగా గడిచిపోతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బావుంది. సెకెండాఫ్‌లో యాక్షన్‌ పాళ్ళు కాస్త ఎక్కువయ్యాయి. సీరియస్‌ మూమెంట్స్‌ కూడా వున్నాయి. అయినప్పటికీ సినిమా అంతా ఎనర్జిటిక్‌గా ఉండటంలో దర్శకుడి పనితనమే కీలక భూమిక పోషించింది. బి, సి ప్రేక్షకుల్ని మెప్పించే మాస్‌ ఎలిమెంట్స్‌ సినిమా నిండా వున్నాయి. ఏ`సెంటర్స్‌ ప్రేక్షకుల్ని మెచ్చుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా వుంది. పబ్లిసిటీ సరిగ్గా చేస్తే, ప్రాఫిటబుల్‌ మూవీ అయ్యేందుకు ఆవకాశం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
పటాస్‌లో కమర్షియల్‌ మందుగుండు సరిపోయింది

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Amy Jackson