Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Good talk about ladies and Gentlemen

ఈ సంచికలో >> సినిమా >>

త్రిష కాబోయే భర్త ఆమెకన్నా ఘనుడే

Trisha Husband

హీరోయిన్‌ త్రిష, సినీ నిర్మాత వరుణ్‌ మణియన్‌ని పెళ్ళాడనుంది. పెళ్ళి తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎంగేజ్‌మెంట్‌ను ఘనంగా నిర్వహించుకోవడమే కాకుండా, ఎంగేజ్‌మెంట్‌ రోజున కూడా మూగ జీవాల కోసం ప్రత్యేకంగా సేవా కార్యక్రమం ఒకటి భారీ యెత్తున చేపట్టినట్లు వెల్లడిరచారు త్రిషకు కాబోయే భర్త వరుణ్‌ మణియన్‌.

స్ట్రీట్‌ డాగ్స్‌ని దత్తత తీసుకుని, వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలనీ, మూగ జీవాల పట్ల కరుణతో వ్యవహరించాలని కోరుతూ, పెద్ద క్యాంపెయిన్‌ చేపట్టింది త్రిష గతంలోనే. తన ఇంట్లో ఖరీదైన జాతి కుక్కల్ని కాకుండా, వీధి కుక్క ఒకదాన్ని చిన్నప్పుడే తెచ్చి, దాన్ని పెంచుకుంటున్న త్రిష, వీధి కుక్కలు, ఇతర మూగ జీవాల పట్ల అమితమైన ప్రేమను ప్రదర్శిస్తుంటుంది.

త్రిష ఆలోచనలు నచ్చి, ఆమెను పెళ్ళాడనున్న వరుణ్‌ మణియన్‌, వివాహ వేడుకకు ముందు జరిగే ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమానికి గుర్తుగా, ఆ రోజు పెద్దయెత్తున మూగ జీవాలకు ఆహారం అందించడం, వైద్యం చేయించడం తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడంటే, త్రిషను మించిన ఘనుడే అని చెప్పవలసి ఉంటుంది. ఎంతైనా త్రిషకు కాబోయే భర్త కదా. తన భర్తకు మూగ జీవాలపై వున్న ప్రేమ, వాటికోసం చేస్తున్న సేవే తనకు ఆయన ఇస్తున్న అతిపెద్ద గిఫ్ట్‌గా త్రిష భావిస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Intresting title from Trivikram Srinivas