Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Good News to Bahubali fans

ఈ సంచికలో >> సినిమా >>

ఐటమ్‌ సాంగ్‌ ప్రమోషన్‌ కోసం

Swetha Basu Prasad is in an item song

శ్వేతా బసు ప్రసాద్‌ ‘ఇంటెలిజెంట్‌ ఇడియట్‌’ అనే సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేయడమే కాకుండా, ఆ సినిమా ప్రమోషన్‌లో తనవంతు కృషి చేస్తుంది. కొన్నాళ్ళ క్రితం ఇబ్బందికర పరిస్థితుల్లో వార్తల్లో వ్యక్తి అయిన శ్వేతా, ఆ తర్వాత తెలుగు గడ్డపై కాలు మోపడం ఇదే తొలిసారి. గతకాలపు చేదు సందర్భాల్ని మర్చిపోయి, కెరీర్‌ మీద శ్రద్ధతో ముందుకు వెళుతున్నట్లు శ్వేత చెప్పింది.

నటి అన్నాక అన్ని రకాల పాత్రలూ పోషించాలనే ఉద్దేశ్యంతోనే స్పెషల్‌ సాంగ్‌ చేయవలసి వచ్చిందని చెబుతూ, హిందీలో ‘రూట్స్‌’ పేరిట ఓ డాక్యుమెంటరీ చేస్తున్నానని వెల్లడిరచింది శ్వేత. ఎంతో ఎఫర్ట్‌ పెట్టి చేస్తున్న ‘రూట్స్‌’ తనకు కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెడుతుందని ఆమె ఆశిస్తుంది. హిందీ సినిమా రంగం నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, వాటిల్లో కొన్ని ఫైనలైజ్‌ అయ్యే దశలో ఉన్నాయి గనుక వివరాలు ఇప్పుడే చెప్పలేనని అంటోంది శ్వేతా బసు ప్రసాద్‌.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ప్రవేశించిన శ్వేతా బసు ప్రసాద్‌, కొన్ని చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించి, నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఐటమ్‌ సాంగ్‌ చేస్తున్న సినిమా ప్రమోషన్‌ కోసం కష్టపడుతున్న శ్వేతా బసు ప్రసాద్‌ని మెచ్చుకోకుండా ఉండలేం.

మరిన్ని సినిమా కబుర్లు
Cheppukondi Chooddam