Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ :  విరాట్ పై కోపంతో సహస్ర వస్తువులన్నీ విసిరేస్తుంది ఆపై అదే కోపంతో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరుతుంది...ఆమే వెనకే విరాట్ కూడా ఆమె ఇంటికి చేరుకుంటాడు..సహస్ర తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని సహస్రకు కూడా ఇస్తాడు..ఇక్కడ దీక్ష- చందూలిద్దరూ ప్రేమించుకోవడంలో మునిగిపోతారు......ఆ తర్వాత.............         ఆ తర్వాత......

 

చివరకు ఆ ఫ్యాక్టరీని మరోచోట ఏర్పాటు చేసుకున్నారాయన. కాని పాత గొడవలు అలాగే ఉండిపోయాయి. ఇద్దరికీ పడదు కాబట్టి ఒప్పుకోరు.’’

‘‘సరే మమ్మీ. పెళ్ళి వరకు వచ్చాక అప్పుడు చూద్దాంలే. విషయం చెప్పావ్ గా ఒకె. తర్వాత నా సెల్లోంచి ఫోన్ చేస్తాను. ఎప్పుడు చేసినా ఇక నానంబర్ కి చెయ్యి. ఫోన్ పెట్టెయ్’’

‘‘ఆగవే.........ముఖ్య విషయం చెప్పటం మర్చి పోయాను.’’

‘‘ఏంటది?’’

‘‘ప్రకటన చూడగానే మీ డాడీ అగ్గిలం మీద గుగ్గిలం లా మండి పడ్డారు. నువ్వు చెన్నై లో ఎక్కడున్నా పట్టి తీసుక రమ్మని కదిరేషన్, వడివేలు ఇంకో పదిమందిని తోడిచ్చి గంట క్రితమే జీప్ లో పంపించారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి.’’తీవ్రంగా ఆలోచిస్తూ విరాట్ వంక చూసింది అతను దగ్గరకొచ్చాడు ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకున్నాడు ‘‘ఒకె నిన్నిబ్బంది పెట్టను. వచ్చిన పనయిందిగా. ఇక వెళ్తాను’’ అంటూ వెనుతిరిగాడు.‘‘ఇంత దూరం వచ్చిన వాడివి లోనకు రాకుండా వెళ్తావా?’’ గుమ్మానికి ఓపక్క జేరపడి అడిగింది.‘‘నేను పెద్ద పోకిరి గదా...........వద్దులే’’

‘‘ఆహా!’’

‘‘పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేంత వికారంగా వుంటాను’’

‘‘నా మాటలు వినేశావన్న మాట’’ నవ్వింది.

‘‘నేనెక్కడ విన్నాలే, అవే నా చెవిలోకొచ్చి పడ్డాయి.’’

‘‘ముందు లోనకొస్తావా తలుపేసుకోనా’’

‘‘మాట తప్పే వాళ్ళింట్లోకి నేను రాను’’

‘‘నేను మాట తప్పానా?’’

‘‘కాదా........నన్నుటచ్ చేయలేక పోయావ్ గా? ఓడిపోయిందానివి ఒప్పందం ప్రకారం ముద్దిచ్చి రావాలా వద్దా? ఏడుస్తూ వచ్చేస్తే అర్దం ఏమిటి? వద్దులే వెళ్ళి పోతాను’’

‘‘మళ్ళీ నన్నిరిటేట్ చేస్తున్నావ్ రా. వీధి గుమ్మంలో గొడవ పడితే అసహ్యంగా ఉంటుంది. మర్యాదగా లోనకొస్తున్నావా లేదా?’’ కోప్పడింది సహస్ర.

‘‘సరి సరి అరవక. అంతగా మర్యాద చేస్తానంటే నేను మాత్రం కాదంటానా’’ అంటూ అడుగు లోన పెట్టాడు విరాట్.ఆమె ముఖంలో యిప్పుడు విచారం గాని కోపం గాని వాటి ఛాయలేవీ లేవు. ఎప్పటి సహస్రలా ముఖం కళకళలాడుతోంది. బహుశ తల్లితో మాట్లాడాక ఆమెలో కొత్త ఉత్సాహం ఏర్పడి ఉండాలి.

ఇలా గడప దాటి లోన అడుగు పెట్టాడో లేదో అలా తిరిగి అతని సెల్ ఫోన్ మోగటం ఆరంభించింది.

I              I                     I

కోయంబేడు స్లమ్ ఏరియా.....

అదే కాకా హోటలు

మురడన్ ముత్తూ బేచ్ అంతా ఇంకా అక్కడే ఉంది. న్యూస్ పేపర్ పక్కన పడేసి దీర్ఘాలోచనలో వున్నారంతా. అదృష్టం తలుపు తట్టినట్టే తట్టి వెనక్కి పోయినంత దిగాలుగా వున్నారంతా.

అప్పటికే అర డజను స్ట్రాంగ్ టీలు తాగి మరీ ఆలోచిస్తున్నాడు ముత్తూ. ఎంత ఆలోచించినా వాని బుర్రకి అంతు చిక్కటం లేదు. ఇవాళే ప్రకటన రావటం ఏమిటి? అంతలోనే ఆపిల్ల వెనక్కి వచ్చేయటం ఏమిటి? ఇది నిజమేనా? సంభవమేనా? లేక ప్రకటనిచ్చిన వాడు కావాలని తనతో అబద్దం చెప్పాడా? అది కూడ కాదు. తననింత అవమానించటం కడుపు మంటగా వుంది. మళ్ళీ ఫోన్ చేస్తే ఏర్ పోర్ట్ రన్ వే మీద పడేసి విమానాలతో తొక్కిస్తానన్నాడు. అసలు ఎవడు వీడు? ఎలా ఉంటాడు?

‘‘ఇంకా ఏందన్నాఆలోచన, వదిలేయ్. ఆ కోటి రూపాయలు లేదంతే మర్చిపో ’’ అంటూ ముత్తూ భుజం తట్టాడొకడు.

‘‘అవునన్నా మనకి ప్రాప్తం లేదు. ఇలా ప్రకటనివ్వగానే ఆ పిల్ల ఆలా వెనక్కి రావటం ఏంటి? ఓ వారం పది రోజులు ఆగొచ్చు గదా. అంతా మన బేడ్ లక్’’ అంటూనిట్టూర్చాడు మరొకడు.

‘‘పోనీ ఇంకో సారి ఫోన్ చేసి అడిగితే ఎలా ఉంటుంది?’’ మరొకడు ఆశ వదులుకోలేక సలహా యిచ్చాడు. అది విని మండి పడ్డాడు ముత్తూ.‘‘పళ్ళు రాలగొడతాను ఎధవ సలహా నువ్వూను. మళ్ళీ ఫోన్ చేసి ఇంకోసారి తిట్లు తినమంటావా? ఇప్పటికే వాడన్నమాటలకి గుండెలు మండిపోతున్నాయి. ఏదో ఒకటి చేయాలి. వాళ్ళనొదలకూడదు’’ అన్నాడు ఆవేశంగా ముత్తూ.

అతడి మాటలకు ముఖాముఖాలు చూసుకున్నారంతా

వాళ్ళుఎవరోతెలీదు. ఎక్కడుంటారోతెలీదు. ఏమీతెలీకుండావాళ్ళనిఏంచేద్దామని? మిత్ర బృందం అందరి బుర్రల్లోనూ ఇదే ప్రశ్న కుమ్మరి పురుగులా తొలుస్తోంది

‘‘అయితే ఏం చేద్దామంటావ్?’’ అడిగాడు ఒకడు.‘‘కిడ్నాప్ చేద్దాం’’ ఠకీమని బదులిచ్చాడు ముత్తూ.అతడి సమాధానం వినిషాక్ తిన్నారంతా.‘‘ఎలాగన్నా? అడ్రసు తెలీదుగా?’’ ముక్త కంఠంతో అరిచారంతా.

ఓసారి వాళ్ళందర్నీ కలియ జూసాడు ముత్తూ

‘‘అవున్రా కిడ్నాప్ చేద్దాం. ఇంతకు ముందు ఇదే మాట మీరంటే నేనే వద్దంటూ వచ్చా. ఇపుడు నేనే చెప్తున్నాను. వినండి ఆ ప్రకటనిచ్చిన వాడెవడో గాని కోటీశ్వరుడు. అందులో సందేహం లేదు. అవునా?’’ అడిగాడు.

‘‘మీ సందేహాలు నేను తీరుస్తాను వినండి, ఆ పిల్లను పట్టిస్తే కోటి రూపాయలన్నాడు, మనం ఆ పిల్లని కిడ్నాప్ చేసి మూడు కోట్లు డిమాండ్ చేసినా చచ్చినట్టిస్తాడు’’

‘‘అవుననుకో.......వాళ్ళ అడ్రసు తెలీదుగా’’ మరొకడు గొణిగాడు.

‘‘తెలుసుకుంటాం. ఈ చెన్నై నగరంలో మనకు తెలీని గల్లీ ఉందా? వాడు నాతో మాట్లాడిరదాన్నిబట్టి వాడు ఏర్ పోర్టు ప్రాంతానికి సమీపంలో ఎక్కడో ఉండేవాడే............’’

‘‘ఏఏర్ పోర్టన్నా? ఇంటర్నేషనల్ ఏర్ పోర్టా డొమిస్టెక్ ఏర్ పోర్టా లేక ట్రైనింగ్ సెంటర్ ఏర్ పోర్టా........అలా చూడకన్నా తెలుసుకుందామని..........’’ నసిగాడొకడు.

‘‘ఏ ఏర్ పోర్టో ఈసారి ఫోన్ చేసి అడుగుతా లేరా. అది యిదనకుండా అన్ని ఏర్ పోర్టుల పరిసరాల్లో గాలించాలి. ఎక్కడో చోట ఈ సహస్రనే అమ్మాయి కన్పించకపోదు, ఆ పిల్లను బట్టి ఆమె ప్రియుడ్ని కనిపెట్టొచ్చు. ఫోన్ నంబర్ ఎలాగూ ప్రకటనలో ఉంది. అవునా? వివరించాడు ముత్తూ.

‘‘అవును గాని అన్నా. అందరం కలిసే వెతుకుదామా?’’ తన డౌటు అడిగాడు మరొకడు.

‘‘విడివిడిగా ముష్టెత్తుకుందాం.’’ అన్నాడు విసుగ్గా ముత్తూ.

‘‘అదేంటన్నా తెలీకేగా అడిగాను?’’ నొచ్చుకున్నాడు అవతలి వాడు.

‘‘నేను తెలిసే చెప్పాన్రా ! నిజమే చెప్పాను. మనమంతా రేపట్నుంచి ముష్టి వాళ్ళ అవతారం ఎత్తాలి. ఏర్ పోర్టు పరిసరాల్లో తిరిగాలి. ఇంటింటికీ పోయి బిచ్చమడగాలి, మన తిండి గడిచి పోతుంది. వీలయితే మన చేతివాటం ఎలాగు చూపిస్తాం. పోతే అందరం సెల్ ఫోన్లతో టచ్ లో ఉండాలి. మనం మొత్తం పన్నెండు మంది ఉన్నాం. మనలో ఎవడు ముందుగా ఈ పిల్లను చూసినా కంగారు పడకుండా మిగిలిన వాళ్ళకు ఫోన్లు కొట్టి ఎక్కడికి రావాలో చెప్పాలి. ముఖ్యంగా ఆ పిల్ల ఒంటరిగా కనబడ్డా వెంట తన లవర్ తో వున్నా వాళ్ళు కార్ లో వచ్చినా బైక్ మీద వచ్చినా.......ఆటోలో ఫాలో చేసి వాళ్ళుంటున్న యిల్లు ఎక్కడో తెలుసుకోవాలి. ఈ పేపర్ లో ప్రకటన వున్న సహస్ర ఫోటోను తలోకటి దగ్గరుంచుకోవాలి. వెళ్ళి ఓ డజను న్యూస్ పేపర్లు కొని పట్రండి. అన్నిఏర్పాట్ల తో మధ్యాహ్నం భోంచేసి మనమంతా ఏర్ పోర్టుకి వెళ్ళి పోతున్నాం. అర్ధమవుతుందా...?

వచ్చేటప్పుడు కొన్ని చినిగిన దుస్తులు ఓ గుడ్డ సంచిలో వేసి తెచ్చుకోండి. అడుక్కోడానికి ఓ సత్తు ప్లేటు మంచి నీళ్ళకి ఓ ప్లాస్టిక్ బాటిలు. ఇక వెళ్దాం. వారం తిరక్క ముందే వాళ్ళని పట్టాలి. కోట్లు పట్టేయాలి. విజయం మనదే’’ అంటూ లేచాడు ముత్తూ. అతడి మాటలతో ఒక్కసారిగా ఉత్సాహంతో లేచారంతా.

I              I                     I

అక్కడ విరాట్ యింట్లో

చందూ బెడ్ రూమ్.....

అతడి ఛాతీ మీద తలాన్చుకొని పడుకునుంది దీక్ష. చందూ చేతులు ఆమె నడుంని తడుముతున్నాయి. కౌగిట్లో క్షణాలు తెలీటంలేదు యిద్దరికీ. ఇంతలో

గోడ మీద బల్లి కిచకిచలాడింది

‘‘ఏయ్ దీక్షా!’’ పిలిచాడు.

‘‘వూ’’ అంది.

‘‘ఆ బల్లి అరిచింది. ఎందుకు?’’

‘‘పట్ట పగలు సరసాలేమిటి బుద్ది లేకుండా అనరిచింది’’

‘‘కాదు ఎంత సేపూ ముద్దులూ సుద్దులేనా కాస్త మంచాన్నికిరకిరలాడించొచ్చుగా అంటోంది.’’

ఆ మాటతో గబుక్కున లేచి కూచుంది దీక్ష.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana