Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌

movie review - ladies and gentlemen

చిత్రం: లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌
తారాగణం: చైతన్య కృష్ణ, అడివి శేష్‌, మహత్‌ రాఘవేంద్ర, కమల్‌ కామరాజు, నిఖితా నారాయణ్‌, స్వాతి దీక్షిత్‌, జాస్మిన్‌ భాసిన్‌, హర్ష తదితరులు
చాయాగ్రహణం: జగన్‌ చావలి
సంగీతం: రఘు కుంచె
నిర్మాణం: షిర్డీ సాయి కంబైన్స్‌, పిఎల్‌ క్రియేషన్స్‌
సమర్పణ: గో తెలుగు
దర్శకత్వం: పిబి మంజునాథ్‌
నిర్మాతలు: మధుర శ్రీధర్‌, డా.ఎంవికె రెడ్డి, రాజ్‌ కందుకూరి
విడుదల తేదీ: 30 జనవరి 2015

క్లుప్తంగా చెప్పాలంటే
విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య నడిచే కథ ఇది. కృష్ణమూర్తి (చైతన్య) ఓ బ్రిలియంట్‌ స్టూడెంట్‌. తన అభిరుచులకు తగ్గట్టుగా వుండే అమ్మాయి కోసం ఫేస్‌ బుక్‌లో వెతుకుతుంటాడు. విజయ్‌ (మహత్‌) ఓ కాల్‌ సెంటర్‌ ఉద్యోగి. లైఫ్‌ని రిచ్‌గా ఊహించుకుంటాడు. దాన్ని సాధించేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడే రకం అతడు. ప్రియ (నిఖిత) బాగా డబ్బున్నా, నిత్యం పని తప్ప వేరే యావలేని భర్త (కమల్‌ కామరాజు) కారణంగా లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యడానికి వీల్లేని పరిస్థితుల్లో ఆవేదన చెందుతుంటుంది. తన వేటలో కృష్ణమూర్తి, దీప (స్వాతి)ని కలుసుకుంటాడు. ప్రియకి తన పాత స్నేహితుడు రాహుల్‌ (అడివి శేష్‌) కలుస్తాడు. విజయ్‌ ఓ దారి ఎంచుకుంటాడు. ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే
చైతన్య కృష్ణ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నటుడిగా మంచి మార్కులేయించుకుంటాడు. మహత్‌ ఓకే. కమల్‌ కామరాజు మామూలే. అడివి శేష్‌ హ్యాండ్సమ్‌ లుక్‌తో కనిపించాడు. నిఖిత నారాయన్‌ గ్లామరస్‌గానే కాకుండా, అవసరమైన సన్నివేశాల్లో నటనతోనూ ఆకట్టుకుంది. సీరియస్‌గా సాగే సన్నివేశాల్లో మంచి నటనా ప్రతిభను ప్రదర్శించింది. స్వాతి దీక్షిత్‌, జాస్మిన్‌ భాసిన్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హర్ష నవ్వులు పూయించాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.

డైలాగ్స్‌ బాగున్నాయి.స్క్రీన్‌ప్లేతో దర్శకుడు సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మెలోడియస్‌గా ఉంది. మూడు పాటలు వినడానికీ, చూడ్డానికీ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణ. రిచ్‌గా సినిమా కనిపించిందంటే ఆ గొప్పతనం సినిమాటోగ్రఫీదే. ఎడిటింగ్‌ బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. రియలిస్టిక్‌ స్టోరీలైన్‌తో సినిమాని దర్శకుడు రిచ్‌గా తెరకెక్కించాడు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడని నిర్మాతల కారణంగా సినిమాకి రిచ్‌ లుక్‌ వచ్చింది.

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ, ఆలోచింపజేసే అనేక అంశాల్ని దర్శకుడు జాగ్రత్తగా ప్రేక్షకుల ముందుంచే ప్రయత్నం చేశాడు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా పరిచయమయ్యే అపరిచితులతో తలెత్తే ఇబ్బందుల గురించి దర్శకుడు తీసుకున్న టర్న్‌ బాగుంది. ఫస్టాఫ్‌ స్మూత్‌గా సాగిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, ఎమోషనల్‌ మూమెంట్స్‌తో సాగిపోయే ఫస్టాఫ్‌కి, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో ఇంట్రెస్టింగ్‌ బ్రేక్‌ పడి, సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. సెకెండాఫ్‌ కొంచెం సీరియస్‌ టోన్‌లో సాగుతుంది. చివరి 20 నిమిషాల సినిమాని బాగా ప్లాన్‌ చేసుకున్నాడు దర్శకుడు. సినిమాలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేయగలిగాడు. సక్సెస్‌ అవడానికి కావాల్సిన ఇన్‌గ్రెడియంట్స్‌ అన్నీ ఉన్నాయిందులో. పబ్లిసిటీ ఇంకాస్త బాగా చేస్తే హిట్‌ రేంజ్‌కి వెళ్ళడం కష్టం కాదు. ఈ జనరేషన్‌కి మంచి మెసేజ్‌ ఇచ్చిన దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేం.

ఒక్క మాటలో చెప్పాలంటే
లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. ఓ లుక్కేయాల్సిందే


అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
enough when reach 1lakh audiance-madhura sridhar