Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

విశిష్ట నటుడికి విశేష పురస్కారం

great honour for great actor

సమాజాన్ని పీడిరచుకు తినే విలన్‌ పాత్రలో అయినా, ఓ గొప్ప తండ్రి పాత్రకు అయినా కామెడీ చేయడంలో అయినా ఎలా చూసినా ఆయనకు ఆయనే సాటి. ఇంకెవరూ రారు ఆయనకు సాటి. అతనే కోట శ్రీనివాసరావు. ఏ సినిమాలో ఏ పాత్రలో కనిపించినా, ఆ పాత్రకీ, ఆ సినిమాకి వన్నె తెచ్చే కోట శ్రీనివాసరావు నట జీవితంలో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆ పురస్కారాల జాబితాలో ఓ విశిష్టమైన పద్మ పురస్కారం చేరింది.

అవార్డులకన్నా ప్రేక్షకుల రివార్డులే ఎక్కువ సంతృప్తినిస్తాయని అందరు నటుల్లానే కోట శ్రీనివాసరావు కూడా ఎప్పుడూ చెబుతారు. దేవుడి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో తాను నటుడిగా ఈ స్థాయికి వచ్చాననీ, ప్రేక్షక దేవుళ్ళు ఆదరించడం వల్లనే పద్మశ్రీ పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగానని అన్నారాయన.

ఎందరో పరభాషా నటులు వస్తున్నా, ఆ ధాటికి తట్టుకుని నిలబడ్డ విలక్ష నటుల్లో కోట శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. తన ఒంట్లో జీవం ఉన్నంతవరకూ నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తానంటున్న కోట శ్రీనివాసరావు తన నట జీవితంలో ఇంకా గొప్ప గొప్ప పాత్రలు పోషించి, ఇంకా ఉన్నతమైన పురస్కారాలను అందుకోవాలని ఆశిద్దాం

మరిన్ని సినిమా కబుర్లు
girl as patas