Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
great honour for great actor

ఈ సంచికలో >> సినిమా >>

‘పటాస్‌’ లాంటి పోరీ

girl as patas

కళ్యాణ్‌రామ్‌ నటించగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పటాస్‌’ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో హీరోయిన్‌ శృతి సేథ్‌ గ్లామర్‌ కూడా ప్రముఖ పాత్ర పోషించింది. అందానికి అభినయం తోడైతేనే హీరోయిన్‌గా ఎవరైనా రాణించగలరనే వాస్తవం ఆమెకు బాగా తెలుసట. తొలి చిత్రం కావడంతో నటన పరంగా కొన్ని సమస్యలు ఉన్న మాట నిజమేనని ఒప్పుకుంటూ, తదుపరి చేయబోయే చిత్రాల్లో నటనలో ఇంకా తనకు తాను మెరుగులు దిద్దుకుంటానని శృతి చెప్పింది.

టెలివిజన్‌ ప్రెజెంటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తనకు, ‘పటాస్‌’ సినిమాలో కూడా అలాంటి పాత్రే దక్కడం యాదృశ్చికంగా జరిగిందని అంటున్న శృతి సేథ్‌, గ్లామరస్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటూనే, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసి, నటిగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని అంటుంది.

‘పటాస్‌’ విడుదలకు ముందే కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ తొందరపడలేదనీ, ‘పటాస్‌’ తర్వాత ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయని శృతి సేథ్‌ వెల్లడిరచింది. హిట్‌ సినిమాతో కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే, గోల్డెన్‌ లెగ్‌ అంటారు తెలుగు సినీ పరిశ్రమలో. శృతి సేథ్‌ జాగ్రత్తగా స్టెప్‌ వేసి, ఇంకో హిట్‌ కొడితే పటాస్‌ పోరీ గోల్డెన్‌ లెగ్‌ అనే గుర్తింపు ఆమె తెచ్చుకుంటుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Mahesh Bhatt appreciates Ladies & Gentlemen