Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Mahesh Bhatt appreciates Ladies & Gentlemen

ఈ సంచికలో >> సినిమా >>

నాటీ నాటీ ఆలోచనలు చేస్తున్న క్యూటీ

cuty with naughty thoughts

భార్య సుజానేకు ఇటీవలే విడాకులు ఇచ్చిన బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ పట్ల ఎందరో అందాల భామలు ఆకర్షితులవుతున్నారు. తన మెయిల్‌ బాక్స్‌ అమ్మాయిల ‘ప్రపోజల్స్‌’తో నిండిపోతోందని హృతిక్‌ రోషన్‌ ఓ పక్క ఆవేదన చెందుతుంటే, ఇంకో వైపు అతని పట్ల ఎట్రాక్ట్‌ అవుతున్న వారి లిస్ట్‌ పెరిగిపోతోంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ కూడా చేరింది.

హృతిక్‌ రోషన్‌ అందగాడనీ, అతనితో నాటీ నాటీగా ఉండాలనే చిలిపి ఆలోచన కలుగుతోందని అలియా భట్‌ అనడంపట్ల బాలీవుడ్‌లో ప్రతి ఒక్కరూ విస్మయం చెందారు. అలియాతో పోల్చితే హృతిక్‌ రోషన్‌ని అంకుల్‌లానే చూడాలి. పాల బుగ్గల పసిపాప అన్నట్లుగా ఉంటుంది అలియా భట్‌. తెరపై హాట్‌ హాట్‌గా కనిపించినా దాన్ని ఆమె క్యూట్‌నెస్‌ డామినేట్‌ చేస్తుంది.

అలియా ఓకే అంటే ఆమె కోసం క్యూ కట్టే హీరోలకు బాలీవుడ్‌లో లెక్కే ఉండదు. హృతిక్‌ రోషన్‌ కూడా అమ్మాయిల కలల రాకుమారుడు. కానీ వయసు తేడా అనేదొకటుంటుంది కదా. దాని గురించి ఆలోచించకపోతే ఎలా? అని ఎవరో ప్రశ్నిస్తే, సినిమాలో నాటీగా హృతిక్‌తో నటించాలని తానేదో అంటే దాని గురించి ఎందుకు రాద్ధాంతం? అంటూ కస్సుమంది అలియా.

మరిన్ని సినిమా కబుర్లు
young hero