Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
young hero

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌కి ఆరంభం అదిరింది

great begin for tollywood

తెలుగు సినీ పరిశ్రమకు 2015 మంచి ఆరంభాన్ని ఇచ్చింది. రెండు పెద్ద సినిమాలు ఈ జనవరిలో విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన భారీ మల్టీస్టారర్‌ సినిమా ‘గోపాల గోపాల’ హిట్‌ అయ్యింది. కొన్ని కారణాలతో విడుదల ఆలస్యమయినప్పటికీ లేటెస్ట్‌ హిట్‌ నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ కొట్టాడు ‘పటాస్‌’ సినిమాతో.

తొలి నెల జనవరి తెలుగు సినీ పరిశ్రమకు రెండు హిట్స్‌ ఇవ్వడంతో, ఈ ఇయర్‌ తెలుగు సినీ పరిశ్రమ సక్సెస్‌ వెలుగులతో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి ‘టెంపర్‌’, ‘లయన్‌’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మెగా కుటుంబం నుంచి ఆల్రెడీ హిట్‌ నమోదయ్యింది. ఈ ఇయర్‌ ఫస్టాఫ్‌లోనే ‘బాహుబలి’ సినిమా కూడా రానుంది. త్వరలో విడుదల కానున్న ‘రుద్రమదేవి’ పైన కూడా అంచనాలు ఆకాశాన్నంటేలానే ఉన్నాయి.

ఎలా చూసినా, ఫస్టాఫ్‌లో సెన్సేషనల్‌ హిట్స్‌ రెండో మూడో వచ్చి, తెలుగు సినీ పరిశ్రమ కళకళ్ళాడనుందని చెప్పడంలో సందేహం లేదు. సెకెండాఫ్‌లో కూడా ప్రెస్టీజియస్‌ కాంబినేషన్స్‌లో కొన్ని సినిమాలు రానున్నాయి. ఆరంభం అదిరింది గనుక, తెలుగు సినీ చరిత్రలో 2015 అద్భుతమైన సంవత్సరంగా రికార్డులకెక్కుతుందేమో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
hyderabad love story