Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyothi padham

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం ( ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 12 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. చేపట్టు పనుల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండి వాటిని పూర్తిచేసే దిశగా అడుగులు వేయుట మంచిది. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయి నుండి ప్రశంశలు లభించే అవకాశం కలదు. నలుగురిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం మూలాన మేలుజరుగుతుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. కుటుంభంలో లేదా ఆప్తుల కుటుంభంలో శుభకార్యములు జరుగుటకు అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన భాగస్వామ్య ఒప్పందాలు జరుగుటకు అవకాశం కలదు.

వృషభ రాశి : ఈ వారం మొత్తంమీద నూతన లావాదేవీల విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. నూతన ప్రయత్నాలు ఆరంభించుట కన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ద వద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మూలాన మేలుజరుగుతుంది. సోదరులకు అనుగుణంగా వ్యవహరించుట సూచన ఆర్థికపరమైన విషయాల్లో వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు చర్చాసంభందమైన విషయాలకు అధికసమయం ఇస్తారు. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నం పెంచుట మంచిది. ఉద్యోగంలో అధికారులతో చేయుచర్చలు పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చును సర్దుబాటు అవసరం. 

మిథున రాశి : ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనులకు అలాగే ఆలోచనలకు సమయం ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది అదేవిధంగా ఖర్చులు కూడా మీ శక్తిని దాటిపోవుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదావేయుట వలన మేలుజరుగుతుంది. నూతన నిర్ణయాల విషయంలో తొందరపాటు ఆలోచనలు చేయకండి బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు మీలో కొత్త కొత్త సందేహాలను పెంచుటకు అవకాశం ఉంది ఓపిక అలాగే వేచిచూసే దొరని అవసరం. సమయానికి భోజనం చేయుట మంచిది లేకపోతే స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుతాయి కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెద్దలతో చేయు ఆలోచనలు మీలో స్వల్ప మార్పులను తీసుకోనివచ్చే అవకాశం కలదు.  

కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో తోటివారిని మీయొక్క మాటతీరు స్వల్పంగా ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పనుల విషయలో ఉత్సాహంను కలిగి ఉండి వాటికి సమయం ఇచ్చే ఆస్కారం కలదు అలాగే వాటివిషయంలో ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తారు. నలుగురిలో చేపట్టిన పనుల వలన మంచిపేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. అధికారులతో వారంచివరలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున మాటలు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. విలువైనవస్తువులను కొనుగోలు చేసుకొనే అవకాశం ఉంది ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. బంధువులతో చేయుపనుల మూలాన అధికమైన శ్రమను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త.

సింహ రాశి : ఈ వారం మొత్తంమీద నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు అలాగే నచ్చిన ప్రదేశాలకు వెళ్ళుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయల్లో మాత్రం నిదానంగా వ్యవహరించుట అలాగే మీయొక్క వ్యవహారశైలి తోటివారిని ఇబ్బందికి గురిచేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబసభ్యుల నుండి మీరు ఆశించిన మేర సహాయసహకారాలు రాకపోవడం మూలాన కొంత అసంతృప్తిని కలిగి ఉండే అవకాశం కలదు. ఉద్యోగంలో చేపట్టిన ఆలోచనలు అధికారులకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవడం అలాగే కొని కొన్ని విషయాల్లో సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన ముందు ముందు మీకు లబ్దిని కలుగ జేస్తుంది.

కన్యా రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో కొంత ఒత్తిడిని కలిగి ఉండే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నం చేయుట అలాగే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెల్లుట వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాల విషయంలో ఒక ఆలోచనతో ముందుకు వేలుతకు అవకాశం ఉంది అనుభవజ్ఞుల సూచనలతో ప్రయత్నం చేయుట వలన చక్కటి ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కలదు. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది కాకపోతే దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురికి ఉపయోగ పడే పనులను చేయుట వలన నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు తగిన జాగ్రత్తలు తీసుకోండి. 


తులా రాశి : ఈ వారం మొత్తంమీద మీరు సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడం వలన చాలాకాలంగా ఆగిఊన్న పనులను పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం కలదు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులనుండి సంతృప్తికరమైన ఫలితాలు వచ్చుటకు ఆస్కారం కలదు.అకారణంగా ఇతరుల మూలాన మీలో కొత్త కొత్త సందేహాలు కలుగుటకు అవకాశం ఉంది ఈ విషయంలో అనుభవానికి పెద్దపీట వేయుట అన్నివిధాల శ్రేయస్కరం. వ్యాపారంలో మీరు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును సర్దుకుపొండి. నలుగురిలో ఉన్నప్పుడు మాటతీరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది లేకపోతే కొత్త సమస్యలు వస్తాయి. ఊహించని ఖర్చులకు అవకాశం కలదు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.


వృశ్చిక రాశి  : ఈ వారం మొత్తంమీద ఆశించిన ఫలితాలు వస్తాయి అలాగే నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు. సమయాన్ని భందుమిత్రులతో గడుపుతారు ఆప్తులను కలుస్తారు వారితో చేయు చర్చలు పురోగతిని ఇస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. పెట్టుబడులు అలాగే వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో శ్రమతప్పక పోవచ్చును అలాగే తోటివారితో ఊహించని విధంగా విబేదాలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త. దూరప్రదేశాలు ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు వీతిమూలన కొంత చికాకును పొందుతారు అలాగే ఇబ్బందులు కలుగుతాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకొనే ప్రయత్నం చేయుట మంచిది.


ధనస్సు రాశి  : ఈ వారం మొత్తంమీద పెద్దలతో చర్చాసంభందమైన విషయలకు సమయం ఇస్తారు. ప్రణాళికా బద్దంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను కొంత నిదానంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన ఒప్పందలాను అలాగే అభినందనలు పొందుటకు అవకాశం కలదు. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే అందరిని సంప్రదించట మంచిది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం సూచన. బందుమిత్రులనునుండి మీరు ఆశించిన విధంగా సహకారం నిదానంగా అందుతుంది కాకపోతే వాటికోసం మీరు కొంత ప్రయత్నం చేయుట మంచిది. విదేశేప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడం అన్నివిధాల మేలుచేస్తుంది ఆలోచన చేయుట మంచిది. కుటుంబంలో సభ్యుల నుండి సహకారం కోరుకుంటారు.         


మకర రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుతాయి చిన్న చిన్న జాగ్రత్తలు తీఉస్కొవ్దమ్ వలన వెంటనే కోలుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది కావున నలుగురి సహకారంతో ముందుకు వెళ్ళుట సూచన. రాజకీయపరంగా ముందుకు వెళ్తారు.  పెద్దలతో మీకున్న పరిచయాలు లాభిస్తాయి కాకపోతే మాటతీరును మెరుగుపరచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. సంతానపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి గత కొంతకాలంగా వేచిచూస్తున్న విషయంలోని ఫలితం మీకు తెలిసే అవకాశం ఉంది. అంతరంగిక మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది.        


కుంభ రాశి : ఈ వారం మొత్తంమీద స్త్రీ సంభందమైన విషయలకు సమయం ఇస్తారు వారి నుండి నూతన విషయలను తెలుసుకొనే అవకాశం ఉంది. మిత్రులకు సహకారం అందిస్తారు. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మాత్రం అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. తోటివారితో స్వల్ప విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది వివాదములకు అవకాశం ఇవ్వకండి. అనారోగ్యసమస్యలు కలుగుతాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే సమయానికి భోజనం చేయుట మంచిది. దైవపూజలకు సమయం ఇవ్వడం సూచన.    


మీన రాశి : ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు.  మిత్రులతో కలిసి చేపట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అలాగే కొంత శ్రమను కల్పించుకోవడం అవలన్ లక్ష్యాలను పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశప్రయాణాలు చేస్తారు అలాగే ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలు అయ్యందుకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయా ల్లో సొంత నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట ఉత్తమం.సంతానం మూలాన సంతోషాని అలాగే గౌరవాన్ని పొందుతారు. స్త్రీ లనుండి విలువైన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. మాత్రువర్గంతో సమయం గడుపుతారు.      

టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
jayajaya devam