Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
puri's jyothilakshmi adhurs

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా హిట్టు పాట డబుల్‌ హిట్టు

movie hit song double hits

‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సినిమా పెద్ద విజయం సాధించే దిశగా పరుగులు పెడుతుంది. హిట్‌ టాక్‌తో ప్రేక్షకులు సినిమాని ఆశీర్వదించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ పెద్ద హిట్‌. సాధారణంగా పాటలు హిట్టయితే సినిమాకి ప్లస్‌ అవుతుంది. సినిమాకి పాటలూ ప్లస్‌ అవుతాయి.

‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సినిమాకి కూడా ఇదే జరిగింది కాని కొంచెం డిఫరెంట్‌గా జరిగిందది. ఈ సినిమాలో ఇంటర్నెట్‌ మీద రాయబడిన పాట, సినిమా విడుదలకు ముందే పెద్ద సంచలనం. అది సినిమా పట్ల క్యూరియాసిటీని క్రియేట్‌ చేసింది ఆడియన్స్‌లో. సినిమా విడుదలయిన తర్వాత మళ్ళీ ఆ పాట ‘వైరల్‌’ అయిపోయింది ఇంటర్నెట్‌లో.

సినీ అభిమానులు ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సినిమాతోపాటుగా, ఇంటర్నెట్‌ పాట గురించీ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలకు ముందు ఓ సారి హిట్‌. సినిమా విడుదలయ్యాక ఇంకోసారి హిట్‌. అలా ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సినిమాలోని ‘ఇంటర్నెట్‌’ పాట డబుల్‌ హిట్‌ అయ్యింది. సిరాశ్రీ రచించారు ఈ పాటని. ‘గో తెలుగు డాట్‌ కామ్‌’ సమర్పణలో ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సినిమా రూపొందింది. మంజునాథ్‌ దర్శకుడు. మధుర శ్రీధర్‌ నిర్మాత.

మరిన్ని సినిమా కబుర్లు
allari bandipotu