Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie hit song double hits

ఈ సంచికలో >> సినిమా >>

అల్లరి ‘బందిపోటు’ దోచుకుంటాడా?

allari bandipotu

వెరైటీ చిత్రాలు తీసే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, అల్లరి నరేష్‌తో సినిమా చేస్తున్నాడనగానే అవాక్కయ్యారు కొందరు. ఊర మాస్‌ కామెడీ, పేరడీ కామెడీ చేయడాన్నే నమ్ముకుంటూ సినిమాల్ని చేస్తున్న అల్లరి నరేష్‌, సడెన్‌గా ‘బందిపోటు’తో ఎలాంటి కామెడీ చేస్తాడోనని ఎదురు చూస్తున్నారు తెలుగు సినీ ప్రేక్షకులు.

మంచి మెసేజ్‌ చెప్పడానికి సినిమాని మాధ్యమంగా వాడుకునే దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అలాంటి ఆయన అల్లరి నరేష్‌తో సినిమా చేస్తే, దాన్నుంచీ మెసేజ్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేయకుండా ఉండలేరు కదా చూసేవారు. అందుకనే ‘బందిపోటు’ గురించి కొంత ఉత్కంఠ అయితే ఉంది. అల్లరి నరేష్‌ని ‘బందిపోటు’లో చూసి సర్‌ప్రైజ్‌ అవుతారని మాత్రమే ఇంద్రగంటి చెబుతున్నాడు.

విభిన్న పాత్రలు పోషించే టాలెంట్‌ ఉన్నప్పటికీ, తన టాలెంట్‌కి తగ్గ సినిమాలు అల్లరి నరేష్‌ చేయడంలేదు. ‘గాయం’ వంటి సినిమాల్లో అల్లరి నరేష్‌ తన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఆ స్థాయి చిత్రంగా ‘బందిపోటు’ ఉండనుందేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కామెడీతో ప్రేక్షకుల మదిని దోచుకుంటాడో, నటనతోనే ఆ పని చేస్తాడోగానీ ఈ అల్లరి ‘బందిపోటు’ పట్ల ఎక్స్‌పెక్టేషన్స్‌ సాలిడ్‌గానే ఉన్నాయి.

మరిన్ని సినిమా కబుర్లు
triple sensation