Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
allari bandipotu

ఈ సంచికలో >> సినిమా >>

ఆ ముగ్గురూ కలిస్తే అద్భుతమే

triple sensation

నందమూరి కుటుంబంలో ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే అభిమానులకు అది పండగే అవుతుంది. ఆ పండగ వాతావరణం కోసం తాను సిద్ధంగా ఉన్నానంటున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్‌. సోదరుడు ఎన్టీఆర్‌తోనూ, బాబాయ్‌ బాలకృష్ణతోనూ సినిమా చేయడానికి తానెప్పుడూ రెడీ అని అన్నాడు కళ్యాణ్‌రామ్‌ ‘పటాస్‌’ విజయానందంలో.
బాలకృష్ణ 100వ సినిమాకి అవకాశం వస్తే అన్న ప్రశ్న కళ్యాణ్‌రామ్‌ ముందుంచితే, అంతకన్నా అదృష్టం ఏముంటుందని అతను సమాధానమిచ్చాడు. కథ కోసం వెతుకుతున్నాననీ, కథ దొరికితే బాబాయ్‌ని అడుగుతానని చెప్పాడాయన. బాలకృష్ణ ఓకే చెబితే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా బాలకృష్ణ హీరోగా సినిమా వచ్చేయడం సులభమే.
కళ్యాణ్‌రామ్‌, బాలకృష్ణతో నటించే సినిమా సంగతి అలా ఉంచితే, కళ్యాణ్‌రామ్‌, బాలకృష్ణ, ఎన్టీఆర్‌ కలిసి నటించే సినిమా కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. దీన్ని కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తారంటూ ఓ ప్రచారమూ జరుగుతుంది. బాబాయ్‌తోనూ, సోదరుడితోనూ సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో ఉన్న కళ్యాణ్‌రామ్‌, వారిద్దరినీ కలిపి, వారితో తానూ కలిసి నటిస్తే అద్భుతమే అవుతుంది. నందమూరి అభిమానులకూ పండగ అవుతుంది.

 

మరిన్ని సినిమా కబుర్లు
young hero