Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
triple sensation

ఈ సంచికలో >> సినిమా >>

ప్రయోగాల యంగ్‌ హీరో

young hero

మూస కమర్షియల్‌ లవ్‌ స్టోరీస్‌ చేసి వైఫల్యాలు చూసిన యంగ్‌ హీరో నిఖిల్‌, వెరైటీగా ట్రై చేసి హిట్‌ సాధించాడు ‘స్వామిరారా’ సినిమా ద్వారా. ‘హ్యాపీడేస్‌’ సినిమాలోని యంగ్‌స్టర్స్‌ బ్యాచ్‌లో ఒకడైన నిఖిల్‌ సిద్దార్ధ, స్క్రీన్‌పై ఎనర్జీ లెవల్స్‌ చూపడంలో మాస్‌ మహరాజ్‌ రవితేజ తర్వాత తానేననిపించుకున్నాడు.

ఎక్కడ ఎనర్జీని చూపించాలో తెలిస్తేనే స్టార్‌ హీరో అవ్వొచ్చునన్న వాస్తవాన్ని గ్రహించి హిట్స్‌ మీద హిట్స్‌ కొడుతున్న ఈ యంగ్‌ హీరో నుంచి వస్తున్న తాజా చిత్రం ‘సూర్య వర్సెస్‌ సూర్య’. సూర్యకాంతిని భరించలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడే కుర్రాడు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథ.

‘సూర్య వర్సెస్‌ సూర్య’ టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 14న చిత్ర ఆడియో విడుదల కానుంది. మంచి లవ్‌ స్టోరీ, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడట. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ చిత్రాల తర్వాత అంతటి ఘనవిజయం ‘సూర్య వర్సెస్‌ సూర్య’ సాధిస్తుందని చిత్ర రూపకర్తలు విశ్వాసంతో ఉన్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam