Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

గ‌బ్బ‌ర్ సింగ్‌తో పోలిస్తే భ‌య‌ప‌డ్డాను!

interview with kalyan ram

ఒక్క ఫ్లాప్ వ‌స్తేనే కెరీర్‌లో జ‌ర్కులు మొద‌ల‌వుతాయి.
అలాంటిది వ‌రుస‌గా ఏడు ఫ్లాపులు.
ప‌దేళ్లుగా విజ‌యాల్లేవు.
క‌నీసం యావ‌రేజ్ అన్న‌మాట విన‌లేదు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఓం కూడా తుస్సుమంది. పైగా ఇవ‌న్నీ సొంత బ్యాన‌ర్‌లో తీసిన సినిమాలే. మ‌రో హీరో అయితే `సినిమాలు వ‌ద్దురా బాబూ` అనుకొని గుడ్‌బై చెప్పేస్తాడు. కానీ క‌ల్యాణ్‌రామ్ మాత్రం నిల‌బ‌డ్డాడు. ఏటికి ఎదురెళ్లాడు. ప‌రాజ‌యాల్ని ఢీ కొట్టాడు. చివ‌రికి హిట్ కొట్టాడు. ప‌టాస్‌తో ప‌దేళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించింది. ప‌టాస్‌తో క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గానూ ఓ ధైర్యం, న‌మ్మ‌కం సంపాదించాడు క‌ల్యాణ్‌రామ్‌. ఈ సంద‌ర్భంగా క‌ల్యాణ్‌రామ్‌తో ముచ్చ‌టించింది గో తెలుగు. ఆయ‌న చెప్పిన క‌బుర్లు


* ప‌టాస్‌.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఫ‌ట్ ఫ‌ట్‌లాడిస్తోంది..
- థ్యాంక్సండీ. ఇలాంటి మాట‌లు వింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ప‌దేళ్ల త‌ర‌వాత హిట్టొచ్చింది క‌దా.  హిట్ కిక్‌, అదిచ్చే జోష్ ఎలా ఉంటుందో అర్థ‌మైంది.

* ఈ సినిమాకి ముందు నుంచీ పాజిటీవ్ బ‌జ్ ఉంది..
- ఔనండీ. యునానిమ‌స్‌గా ఈ సినిమా హిట్ట‌వ్వాల‌ని అంద‌రూ కోరుకొన్నారు. మీడియా కూడా బాగా స‌పోర్ట్ చేసింది.

* రివ్యూలు చూశారా?
- నా ప్ర‌తి సినిమాకీ ఫీడ్ బ్యాక్ తెప్పించుకొంటా. రివ్యూలు గ‌మ‌నిస్తా. ఎందుకంటే మ‌నం ఎక్క‌డ త‌ప్పులు చేశామో మ‌న‌కు తెలియాలి. ఇప్పుడు తెలుసుకొంటేనే క‌దా.. త‌రువాతి సినిమాలో అవ‌న్నీ క‌వ‌ర్ చేసే అవ‌కాశం వ‌స్తుంది.

* స్టార్ హీరోయిన్ ఉండుంటే  బాగుండేద‌ని ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది..
- ఏం చేస్తాం చెప్పండి. ఇలాంటి కామెంట్లు మామూలే. ఆ స‌మ‌యంలో శ్రుతి బాగుంటుంద‌నిపించింది. తీసుకొన్నాం. నా వ‌ర‌కూ ఆమెపై ఎలాంటి కంప్లైంట్లూ లేవు.

* ప‌దేళ్ల త‌రవాత హిట్ అంటున్నారు.. మ‌ధ్య‌లో హ‌రేరామ్ బాగా ఆడింది క‌దా..?
- ఔనండీ.. క‌మ‌ర్షియ‌ల్‌గా అది నాకు చాలా పెద్ద సినిమా. కానీ హిట్ టాక్ ఎక్క‌వ‌కాలం నిల‌బ‌డ‌లేక‌పోయింది. లేదంటే మ‌రోలా ఉండేది.

* ఓం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు.. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు. కార‌ణాలు విశ్లేషించారా?
- నేను ఇప్ప‌టికీ చెబుతున్నా.. ప‌టాస్ ఆడుతూ పాడుతూ చేసిన సినిమా. ఓం కోసం ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. కానీ విధి విచిత్రం... ఫ‌లితం తారు మారు అయ్యింది. ఓం టైంలో త్రీడీ కొత్త‌. ఆ టెక్నాల‌జి కోసం చాలా రిసెర్చ్ చేయాల్సి వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం కూడా బాగా శ్రమించాం. కానీ ప్రేక్ష‌కులు ఆద‌రించ‌లేదు. ట్విస్ట్‌లూ ట‌ర్న్‌లూ ఎక్కువైపోయాయి బాబోయ్ అన్నారు. ఆ మాటా నిజ‌మే. సినిమా ఎందుకు చూస్తారండీ.. రిలాక్స్ అవ్వ‌డానికి. అలా స‌ర‌దాగా ఏదో సినిమా చూద్దాం అని వ‌చ్చిన ఆడియ‌న్‌పై అంత భారం మోప‌కూడ‌ద‌ని అర్థ‌మైంది.

* కాస్త కామెడీ కూడా ఉంటే బాగుండేది అన్న ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది...
- నిజానికి ఆ సినిమాలోనూ వినోదం పండించే ఛాన్స్ ఉంది. కానీ.. క‌థ‌ని ఇంతే సీరియ‌స్‌గా చెప్పాలేమో అన్న ఫీలింగ్‌తో కామెడీని ప‌ట్టించుకోలేదు. అది పెద్ద త‌ప్ప‌యిపోయింది.

* ప‌టాస్ లో పోలీస్ డ్ర‌స్ వేసుకోగానే మీలో హుషారొచ్చేసింది.. ఎప్పుడూ లేనంత ఎన‌ర్జ‌టిక్‌గా క‌నిపించారు..
- నా సినిమాల‌న్నీ చూసుకోండి. నేను పెద్ద ఎన‌ర్జ‌టిక్‌గా ఉండ‌ను. హీరో పాత్ర‌కు కొన్ని ల‌క్ష‌ణాలుంటాయి. తెర‌పై హీరోని ఇలా చూడాలి అనుకొంటుంటుంటారు ఆడియ‌న్స్‌. అవేం నా పాత్ర‌ల్లో క‌నిపించ‌లేదు. అత‌నొక్క‌డేలో కాస్త హుషారుగా ఉంటాను గానీ, ప‌టాస్ అంత కాదు. `అదెంట్రా బాబూ ఎప్పుడూ ఏదో కోల్పోయిన‌వాడిలా ఉంటావ్ తెర‌పైన‌` అని చాలామంది నాకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. స‌రైన పాత్ర ప‌డితేనే క‌దా.. ఎన‌ర్జీ లెవిల్స్ తెలిసేవి. అది ప‌టాస్‌తో ద‌క్కింది.

* ఈ సినిమా విడుద‌ల‌కు ముందు గ‌బ్బ‌ర్ సింగ్‌తో పోల్చారు.. ప‌టాస్ క‌థ - టెంప‌ర్ క‌థ రెండూ ఒక్క‌టే అన్నారు..
- అవునండీ ఈ వార్త‌లు విని భ‌య‌ప‌డ్డాను. అదేంట్రా.. రెండూ ఒక్క‌టే ఎలా అవుతాయ్‌.?  ఆ క‌థ వేరు, మ‌న క‌థ వేరు క‌దా.. అనుకొని నా సినిమాని ఒక‌టికి ప‌దిసార్లు చూసుకొన్నా.  సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత ఎవ్వ‌రూ పోలిక‌లు వెద‌క‌లేదు. ఇక టెంప‌ర్ అంటారా... ఆ సినిమా ఇంకా రాలేదు క‌దా. దాని గురించి మాట్లాడుకోవ‌డం ఎందుకు. కానీ ఒక్క‌టిమాత్రం నిజం ప‌టాస్‌, టెంప‌ర్ రెండూ వేర్వేరు క‌థ‌లే.

* బాబాయ్ సినిమాలు రౌడీ ఇన‌స్పైక్ట‌ర్‌, ల‌క్ష్మీన‌ర‌సింహాలు కూడా బాగా ఫాలో అయిపోయిన‌ట్టున్నారు?
- ఔనండీ. అనిల్ ప‌టాస్ క‌థ చెప్ప‌గానే నేను చేసిన మొద‌టి ప‌ని.. బాబాయ్ సినిమా రౌడీ ఇనస్పైక్ట‌ర్ సినిమా చూడ‌డం. అందులో బాబాయ్ పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంది. ఇప్ప‌టికీ ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ల‌క్షీ న‌ర‌సింహ సినిమా ముద్ర కూడా ప‌టాస్‌పై ఉంటుంది. కానీ..  ప‌టాస్ ని ఆడియ‌న్స్ ప‌టాస్‌గానే చూశారు. అది మ‌రీ సంతోష‌మేసింది.

* ఈ సినిమా బాబాయ్ కి చూపించారా?
- ఓ.. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది.

* బాబాయ్‌తో ఓ సినిమా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది..?
- నాకూ చేయాల‌నే ఉంది. కానీ బాబాయ్‌కి త‌గిన క‌థ దొరకాలి క‌దా..?  తార‌క్‌తోనూ ఓ సినిమా చేస్తా. స‌మ‌స్య‌ల్లా క‌థ‌ల‌దే.
* షేర్ విష‌యాలేంటి?
- అది కూడా ప‌టాస్‌లా పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ సినిమా. 5 పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్త‌యింది. మే, జూన్‌ల‌లో విడుద‌ల చేస్తాం.

* కిక్ 2 ఎలా వ‌చ్చింది?
- సూప‌ర్‌. మా సంస్థ నుంచి ఇలాంటి సినిమా చేస్తున్నందుకు గ‌ర్వంగా అనిపించింది. ర‌వితేజ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తాత‌గారంటే ర‌వితేజ‌కు బాగా ఇష్టం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ త‌న ఓన్ బ్యాన‌ర్‌గా ఫీల‌వుతున్నాడు.

* పూరితో ఓ సినిమా చేస్తార‌ట‌..
- అవ‌న్నీ చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉన్నాయి. అన్నీ ప‌క్కా అయ్యాక నేనే చెప్తా..

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.. 

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review : Malli Malli Idi Rani Roju