Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with kalyan ram

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

Movie Review : Malli Malli Idi Rani Roju

చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
తారాగణం: శర్వానంద్‌, నిత్యామీనన్‌, నాజర్‌, పవిత్రా లోకేష్‌, తేజస్విని, సన, చిన్నా తదితరులు
చాయాగ్రహణం: విఎస్‌ గుణశేఖర్‌
సంగీతం: గోపి సుందర్‌
నిర్మాణం: క్రియేటివ్‌ కమర్షియల్స్‌
దర్శకత్వం: క్రాంతి మాధవ్‌
నిర్మాత: కె.ఎ. వల్లభ
విడుదల తేదీ: 6 ఫిబ్రవరి 2015

క్లుప్తంగా చెప్పాలంటే:
రాజారామ్‌ (శర్వానంద్‌) ప్రముఖ అథ్లెట్‌. నేషనల్‌ ఛాంపియన్‌ కూడా. నజ్రీన్‌తో రాజారామ్‌ ప్రేమలో పడతాడు. తొలిచూపులోనే ఇద్దరి మనసులూ కలుస్తాయి. అయితే కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోతారు. ఎందుకు విడిపోయారు? ఇద్దరి మధ్యా మనస్పర్ధలకు కారణమేంటి? ఇద్దరూ తిరిగి ఒక్కటయ్యారా? ఇద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారా? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
హీరోగా శర్వానంద్‌ నటన విషయంలో ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. ఈ సినిమాలో ఇంకాస్త మెచ్యూరిటీని ప్రదర్శించాడంతే. మంచి మార్కులేయించుకున్నాడు శర్వానంద్‌ తన నటనకి. సందర్భానికి తగ్గట్టుగా శర్వానంద్‌ నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. పెర్ఫామెన్స్‌ పరంగా, శర్వానంద్‌కి చెప్పుకోదగ్గ సినిమానే ఇది. హీరోయిన్‌ విషయానికొస్తే, ఎట్రాక్టివ్‌ కళ్ళు నిత్యామీనన్‌కి కొండంత బలం. కళ్ళతోనే భావాలు పలికించే అతికొద్ది మంది హీరోయిన్లలో నిత్యామీనన్‌ కూడా ఒకరు. ఇంప్రెసివ్‌ పెర్ఫామెన్స్‌ ఈ సినిమాలో ప్రదర్శించిందామె. చాలా సన్నివేశాల్లో నిత్యామీనన్‌ తన నటనా ప్రతిభతో డామినేట్‌ చేసిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. నాజర్‌ మామూలే. సన ఓకే. పవిత్ర లోకేష్‌ ఆకట్టుకున్నారు. తేజస్విని బావుంది. మిగతా పాత్రధారులంతా సినిమాకి అవసరమైన మేర నటించి, తమ ప్రెజెన్స్‌ని గుడ్‌ అనిపించారు.

రొమాంటిక్‌ స్టోరీ లైన్‌ ఎంచుకున్న దర్శకుడు, ప్రెజెంటేషన్‌లో రిచ్‌నెస్‌ని చూపించాడు. దాంతో క్లాస్‌ టచ్‌ సినిమాకి వచ్చింది. చాలా సన్నివేశాల్లో నెరేషన్‌ చాలా బాగుంది. డైలాగ్స్‌ కవితాత్మకంగానూ సహజంగానూ ఉన్నాయి. స్క్రిప్ట్‌ సాధారణమైనదే అయినా, స్క్రీన్‌ప్లే బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. రెండు పాటలు తెరపై చూడ్డానికీ చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ క్రిస్ప్‌గా వుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్‌ స్ట్రెంగ్త్‌. రిచ్‌గా సినిమా వుందంటే సినిమాటోగ్రఫీ వలనే. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైనంత సహజత్వాన్ని ఇచ్చాయి.

ఫస్టాఫ్‌ రొమాంటిక్‌గా సాగిపోతుంది. కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌, కొంచెం సెంటిమెంట్‌ కలగలిసి బావుందనిపిస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బాగుంది. సెకెండాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఇంట్రెస్టింగ్‌గా సినిమాని తెరకెక్కించడంలో ప్రావీణ్యతను చాటుకున్నాడు దర్శకుడు. క్లాస్‌ టచ్‌, ఫీల్‌ ఉన్న సినిమా కావడంతో మాస్‌కి సినిమా ఎంతవరకు రీచ్‌ అవుతుందంటే అది సస్పెన్సే. ఓవరాల్‌గా మౌత్‌ టాక్‌తో సినిమాకి ఓ మోస్తరు విజయం దక్కవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే: ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 2 - Atupakka AP Itupakka Telangana from Dhee ante dhee movie