Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
manchu laxmi dongata

ఈ సంచికలో >> సినిమా >>

తమిళ, తెలుగు మల్టీస్టారర్‌

telugu, tamil multi starrer

తమిళ హీరో, తెలుగు హీరో కలిసి నటించడం ఎన్నో సినిమాల్లో చూశాం. రజనీకాంత్‌ తెలుగులో పలు సినిమాల్లో నటించారు. శరత్‌కుమార్‌ కూడా చాలా సినిమాలు తెలుగులో చేశారు. ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకే సినిమాలో కన్పిస్తే ఆ ఇద్దరు హీరోల అభిమానులూ ఎంతో సంతోషిస్తారు. కొన్నేళ్ళుగా తెలుగులో మల్టీ స్టారర్స్‌ రాకపోయినా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’ వంటి చిత్రాలతో మల్టీస్టారర్స్‌ లోటు తీరుతోంది.మల్టీ స్టారర్‌ చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ అన్నట్టుగా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, తమిళ హీరో కార్తీ ఓ సినిమాలో నటిస్తున్నారు. పివిపి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రముఖ యువ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, రామ్‌చరణ్‌తో ‘ఎవడు’ సినిమాల్ని రూపొందించాడు వంశీ పైడిపల్లి. ఓ రకంగా ‘ఎవడు’ సినిమా కూడా మల్టీస్టారర్‌గానే గుర్తించాలి.రామ్‌చరణ్‌నీ, అల్లు అర్జున్‌నీ ‘ఎవడు’లో ఒకేసారి కాకపోయినా, కథకు తగ్గట్టుగా చూపించి విజయం సాధించిన వంశీ పైడిపల్లి, నాగార్జున సినిమా కోసం డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఎంచుకున్నాడట. ఈ సినిమాలో ఇంకో హీరో పాత్రకి కార్తీ అయితేనే బావుంటాడని భావించి, అతన్ని సంప్రదించగానే కార్తీ నుంచి కూడా సానుకూల స్పందన లభించిందట. అలా తమిళ, తెలుగు మల్టీస్టారర్‌కి మార్గం సుగమం అయ్యింది.

మరిన్ని సినిమా కబుర్లు
double kik raviteja