Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - టెంపర్‌

Movie Review : Temper

చిత్రం: టెంపర్‌
తారాగణం: ఎన్టీఆర్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రకాష్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, మధురిమ, సుబ్బరాజు, పవిత్ర లోకేష్‌, కాదంబరి కిరణ్‌, అలీ, సప్తగిరి, సోనియా అగర్వాల్‌ తదితరులు
చాయాగ్రహణం: శ్యామ్.కె నాయుడు
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
నిర్మాత: బండ్ల గణేష్‌
విడుదల తేదీ: 13 ఫిబ్రవరి 2015

క్లుప్తంగా చెప్పాలంటే:
దయా (ఎన్టీఆర్‌) ఓ అనాధ. పోలీస్‌ అవ్వాలనేది అతని చిన్ననాటి కోరిక. పెద్దయ్యాక పోలీస్‌ అవుతాడు. అవినీతి అధికారిగా పేరు తెచ్చుకుంటాడు. వాల్తేర్‌ వాసు (ప్రకాష్‌రాజ్‌) తన అక్రమ దందాని కొనసాగించడానికి అవినీతి పోలీస్‌ అధికారి దయాని వైజాగ్‌ రప్పించుకుంటాడు. ఈ క్రమంలోనే దయా, శాన్వి (కాజల్‌ అగర్వాల్‌)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత దయాలో అనూహ్యమైన మార్పులొస్తాయి. ఆ మార్పులేమిటి? అవినీతి అధికారి దయా, నిజాయితీ పరుడిగా మారతాడా? ఈ క్రమంలో అతనెదుర్కొన్న సమస్యలేమిటి? వాటిని అతను ఎలా అధిగమించి శాన్విని సొంతం చేసుకుంటాడు? అనేవి తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే:
ఎన్టీఆర్‌ అల్టిమేట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. ఇప్పటిదాకా చేసిన సినిమాతో పోల్చితే నటన పరంగా కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు ప్రేక్షకులు. నటన, బాడీ లాంగ్వేజ్‌, డాన్సులూ అన్నీ కొత్తగానే ఉన్నాయి. దేనికదే హైలైట్‌. వన్‌ మాన్‌ షో అన్నట్టుగా సినిమా బాధ్యతనంతా తన భుజానికెత్తుకుని, పూర్తి న్యాయం చేశాడు ఎన్టీఆర్‌. అభిమానులు ఏమైతే తననుంచి కోరుకున్నారో, అన్నిటినీ పూర్తిస్థాయిలో ఎలివేట్‌ చేసుకున్న ఎన్టీఆర్‌, అభిమానుల్ని పూర్తిగా అలరించాడు.

కాజల్‌ అగర్వాల్‌ నటనతోనూ, గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. తన పాత్ర వరకూ న్యాయం చేసింది. ఎన్టీఆర్‌తో కాజల్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా పండింది. ప్రకాష్‌రాజ్‌ తనకే సాధ్యమైన వెర్సటాలిటీతో ఆకట్టుకుంటాడు. పోసాని కృష్ణమురళి కెరీర్‌లో రిజిస్టర్‌ అయ్యే ఇంకో పాత్ర ఈ చిత్రంలో పోషించాడు. మధురిమకి ప్రాధాన్యత కలిగి వున్న పాత్ర దక్కింది. ఆ పాత్రలో ఆమె రాణించింది. మంచి పాత్రలు దక్కితే ఆమెలో టాలెంట్‌ బయటకు వస్తుందనిపిస్తుంది. అలీ, సప్తగిరి, జయప్రకాష్‌రెడ్డి తదితరులు ఓకే. సుబ్బరాజు మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అనిపించారు.

వెరైటీ కథ ఏమీ కాదు. తెలిసిన కథే. అయినా దర్శకుడు సినిమాని పరుగులు పెట్టిన వైనం కొత్తగా ఉంది. కావాల్సిన చోట సినిమాని లేపాడు. డల్‌ అవుతున్న ప్రతిసారీ పరుగులు పెట్టించాడు దర్శకుడు స్క్రీన్‌ప్లేతో. డైలాగ్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది. సాంగ్స్‌ తెరపైనా చూడ్డానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణ. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైన రీతిలో వున్నాయి.

అవినీతిలో కూరుకుపోయిన అధికారి, నిజాయితీపరుడిగా ఎలా మారతాడన్న కథాంశంతో అనేక సినిమాలొచ్చాయి. ఇటీవలే ‘పటాస్‌’ సినిమా కూడా ఆ లైన్‌లోనే వచ్చింది. కథ తెలిసిందే అయినా, కథనం విషయంలో కొత్తగా ఆలోచించాడు దర్శకుడు. సీన్స్‌ డిఫరెంట్‌గా తెరకెక్కించాడు. ఉరిశిక్షకు సంబంధించిన సీన్‌ వస్తున్నప్పుడు చిరంజీవినటించగా వచ్చిన ‘అభిలాష’ సినిమా గుర్తుకు వస్తుంది. అలాగే రేప్‌ గురించిన సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ నటించిన ‘రాఖీ’ సినిమా జ్ఞప్తికి వస్తుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్‌ అవకుండా, యాక్షన్‌ని జోడించి, పవర్‌ఫుల్‌గా సీన్స్‌ చూపిస్తూనే, కావాల్సినంత గ్రిప్పింగ్‌గా తీశాడు. ఫస్టాఫ్‌ ఓకే అనిపిస్తుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌తో ఫస్టాఫ్‌ సాఫీగా నడిచిపోతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సెకెండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ పెంచింది. సెకెండాఫ్‌ నుంచి అసలు మజా స్టార్ట్‌ అవుతుంది. సీన్‌ సీన్‌కీ పవర్‌ పెరిగిపోతూ వస్తుంది. సినిమాలో వేగం తారాస్థాయికి చేరేసరికి, క్లయిమాక్స్‌ కూడా అయిపోతుందనిపిస్తుంది. ఇదొక్కటి చాలు సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పడానికి.

సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌, ఫస్ట్‌డే వచ్చిన టాక్‌కి తోడు ఇంకాస్త పబ్లిసిటీ జోడిస్తే, సెన్సేషనల్‌ హిట్‌ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఎన్టీఆర్‌ స్టామినాకి తగ్గ సినిమా పడింది చాలా కాలం తర్వాత. అభిమానులు  భుజానికెత్తుకోవడంపైనే సినిమా సృష్టించబోయే సెన్సేషన్‌ ఆధారపడి వుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: టెంపర్‌ చూపించిన ఎన్టీఆర్‌

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 3 - Mounamgane Edagamani - Naa Autograph Sweet Memories