Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Already impressed taitiltone

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌ స్క్రీన్‌కి స్మాల్‌ స్క్రీన్‌ హెల్ప్‌

Big screen, small screen help

టీవీలు చూసేవారు ఎక్కువవడంతో, సినిమాలు చూసేవారు తక్కువయ్యారనే అభిప్రాయమొకటుంది. సీరియల్స్‌కి అలవాటుపడ్డవారి కారణంగా ఈవినింగ్‌ షోస్‌ డల్‌ అవుతున్నాయంటారు కొందరు. కానీ టీవీ, వెండితెరకు పబ్లిసిటీగా రూపాంతరం చెందింది. టీవీల్లో వచ్చే సీరియల్స్‌, ఇతర కార్యక్రమాలు సినిమాలకు పబ్లిసిటీ పరంగా ఉపయోగపడ్తున్నాయి. అల్లరి నరేష్‌ హీరోగా రూపొందిన ‘బందిపోటు’ సినిమాకి డిఫరెంట్‌గా పబ్లిసిటీ చేశారు. ఓ టీవీ సీరియల్‌లో అల్లరి నరేష్‌ నటించాడు. బందిపోటు సినిమా ప్రమోషన్‌ కోసమే అయినప్పటికీ, బుల్లితెర నటుడిగా రూపొంతరం చెందిన అల్లరి నరేష్‌ ఆ సీరియల్‌లో అలరించడం గొప్ప విశేషంగా చెప్పుకుంటున్నారు.

‘జబర్‌దస్త్‌’ కామెడీ ప్రోగ్రామ్‌లోనూ అల్లరి నరేష్‌ కనిపించి, తన సినిమాకి పబ్లిసిటీ చేసుకున్నాడు. అలీ టాక్‌ షో, ఏటీఎం లాంటి ఎన్నో షోస్‌ సినీ తారలకు, వారు నటించిన సినిమాలకు పబ్లిసిటీ చేస్తున్నాయి. నీకు ఇది నాకు అది అన్నట్లుగా ఆ టీవీ షోస్‌కి టీఆర్పీ రేటింగ్స్‌ పెరిగితే, సినిమాలకు పబ్లిసిటీ లభిస్తుంది. పరస్పర సహకారంతో బిగ్‌ స్క్రీన్‌, స్మాల్‌ స్క్రీన్‌ వర్దిల్లుతున్నాయి. ఈ సహకారం ఇద్దరికీ హెల్పవుతోంది.

మరిన్ని సినిమా కబుర్లు
Confidence on the character: Nithya