Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with naresh

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - బందిపోటు

Movie Review : Bandipotu

చిత్రం: బందిపోటు
తారాగణం: అల్లరి నరేష్‌, ఈషా, సంపూర్ణేష్‌ బాబు, తనికెళ్ళ భరణి, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, అవసరాల శ్రీనివాస్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు
చాయాగ్రహణం: పిజి విందా
సంగీతం: కళ్యాణ్‌ కోడూరి
నిర్మాణం: ఇవివి సినిమా
దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత: ఆర్యన్‌ రాజేష్‌
విడుదల తేదీ: 20 ఫిబ్రవరి 2015

క్లుప్తంగా చెప్పాలంటే:
సొసైటీలో బాగా అవినీతిపరులైన డబ్బున్నవారిని కొల్లగొడ్తుంటాడు విశ్వా (నరేష్‌). అలా చేయడానికి విశ్వా వద్ద ఓ కారణం ఉంటుంది. జాహ్నవి (ఈషా), విశ్వాకి ఓ అసైన్‌మెంట్‌ ఇస్తుంది. అందులో ముగ్గురు వ్యక్తులు మక్రంద్‌ (తనికెళ్ళ భరణి), భలే బాబు (పోసాని కృష్ణమురళి), శేషగిరి (రావు రమేష్‌) ఉంటారు. సొసైటీలో ఈ ముగ్గురూ పెద్ద మనుషులుగా చెలామణీ అవుతుంటారు. జాహ్నవి ఆ ముగ్గురినీ టార్గెట్‌గా ఎందుకు పెట్టుకుంటుంది? జాహ్నవి ఇచ్చిన అసైన్‌మెంట్‌ని విశ్వా పూర్తి చేశాడా? అనేవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా అల్లరి నరేష్‌కి ఇది. తన క్యారెక్టర్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్‌ మూవీ, డిఫరెంట్‌ క్యారెక్టర్‌ తగలడంతో అల్లరి నరేష్‌ తన నటనకు పదును పెట్టుకునే అవకాశం దొరికింది. అల్లరి నరేష్‌ విశ్వా పాత్రలో చాలా బాగా చేశాడు.

ఈషా నేచురల్‌ బ్యూటీ. పెర్ఫామెన్స్‌ వైజ్‌గా కూడా బాగా చేసింది. వాయిస్‌ ఆమెకు అదనపు ఆకర్షణ. గ్లామరస్‌గానూ, పెర్ఫామెన్స్‌తోనూ ఆకట్టుకుంటుంది. తనికెళ్ళ భరణి పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటే, రావు రమేష్‌ పాత్ర అద్భుతంగా ఉంది. పోసాని బాగా చేశాడు. సంపూర్ణేష్‌ గుడ్‌. సప్తగిరి ఓకే. శ్రీనివాస్‌ అవసరాల ఆకట్టుకున్నాడు. శుభలేఖ సుధాకర్‌ని మళ్ళీ తెరపై కనిపించారు. చంద్రమోహన్‌ తన పాత్రకు న్యాయం చేశారు.

ఇంట్రెస్టింగ్‌ స్టోరీలైన్‌తో దర్శకుడు సినిమాని బాగా డీల్‌ చేశాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో ఓవర్‌ ది బోర్డ్‌ అయ్యాయి. స్క్రిప్ట్‌ ఓకే. స్క్రీన్‌ప్లేతో మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చాడు దర్శకుడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. తెరపై పాటలు చూడ్డానికి ఓకే. గుర్తు పెట్టుకునేలా మాత్రం లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్టాఫ్‌ వరకూ ఎడిటింగ్‌ ఓకే. సెకెండాఫ్‌లో ఇంకాస్త బాగా వర్క్‌ చేయాల్సింది ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌. కాస్ట్యూమ్స్‌ బాగా డిజైన్‌ చేశారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ బాగుంది.

రొటీన్‌ కామెడీకి భిన్నంగా అర్థవంతమైన ప్లాట్‌తో సినిమా రూపొందింది. ఫస్టాఫ్‌ సరదాగానే సాగిపోతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌ మందకొడిగా సాగినా, చివర్లో మళ్ళీ పికప్‌ అయ్యింది. డ్రాగింగ్‌ సీన్స్‌ని కొంతవరకు తగ్గించి వుంటే సినిమాపై ఇంపాక్ట్‌ ఇంకా బాగా ఉండేది ఆడియన్స్‌కి. ఓవరాల్‌గా చూస్తే అర్బన్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకునే సినిమా. ఇంటెల్లిజెంట్‌గా మూవీని రూపొందించాడు దర్శకుడు. బాక్సాఫీస్‌ వద్ద సినిమా విజయం సాధించడానికి తగినంత మెటీరియల్‌ని కలిగి ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: బాక్సాఫీస్‌ని లూటీ చెయ్యగలడీ బందిపోటు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka