Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dasari, pavan prestigious movie

ఈ సంచికలో >> సినిమా >>

లిప్‌లాక్‌కి రకుల్‌ తెలివైన సమాధానం

Rakul intelligent answer to Liplock

తెలుగులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడిరది. స్టార్‌ హీరోస్‌తో సినిమాలు చేస్తోంది రకుల్‌. ‘వెంకటాద్రి’ సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈ క్యూట్‌ హీరోయిన్‌, ‘లక్ష్యం’ సినిమాతో సాధించిన విజయం ద్వారా, పెద్ద హీరోలను ఎట్రాక్ట్‌ చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో సినిమాలు చేస్తుంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.హీరోయిన్‌గా సక్సెస్‌ అవడం వెనుక కఠోరమైన శ్రమ ఉందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెబుతుంది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఈ స్థాయిలో తాను ఉన్నానంటుంది ఈ అందాల భామ. లిప్‌ లాక్‌, బికినీ గురించి ప్రశ్నిస్తే, వాటికి తొందర లేదంటూ, నటిగా ప్రూవ్‌ చేసుకోవడంతోపాటు గ్లామరస్‌గా తెరపై కనిపించడంలో తప్పేమీ ఉండదని రకుల్‌ చెప్పింది.లిప్‌ లాక్‌ అయినా బికినీ అయినా, సన్నివేశం డిమాండ్‌ చేస్తేనే కుదురుతుంది. బలవంతంగా సన్నివేశాలు సృష్టించి, గ్లామర్‌ కోసం లిప్‌ లాక్‌ చేయమని అడిగితే ఇబ్బందికరంగా ఉంటుందని, బికినీ గ్లామర్‌ కూడా సరైన సన్నివేశం లేకపోతే వృధా అవుతాయని అంటుంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఎలాంటి ప్రశ్నలకైనా తెలివైన సమాధానాలే ఇస్తున్న రకుల్‌, సినీ పరిశ్రమని బాగానే స్టడీ చేసినట్టుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Sridevi like it?