Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sridevi like it?

ఈ సంచికలో >> సినిమా >>

రేఖని చూసి చాలా నేర్చుకున్నా: కత్రినాకైఫ్‌

Rekha by the most learned: Katrina Kaif

బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖను చూసి, బాలీవుడ్‌ లేటెస్ట్‌ అండ్‌ హాటెస్ట్‌ సెన్సేషన్‌ కత్రినాకైఫ్‌ ఆశ్చర్యంలో మునిగిపోయిందట. వీరిద్దరూ ‘ఫితూర్‌’ అనే సినిమాలో నటించనున్నారు. సినిమా పనుల నిమిత్తం రేఖను వివిధ సందర్భాల్లో కత్రినా కైఫ్‌ కలిసింది. రేఖ అంతటి సీనియర్‌, తమలాంటి జూనియర్స్‌తో తమ అనుభవాల్ని పంచుకుంటున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని అంటోంది కత్రినా. నిజమే రేఖ చాలా సీనియర్‌ నటి. ఎంత సీనియర్‌ అయినా తనకన్నా చాలా జూనియర్స్‌ అయిన నేటితరం హీరోయిన్లకు నటనలో మెలకువలు చెబుతుంది. సెట్స్‌లో ఎలా వుండాలో, దర్శకులు, నిర్మాతలకు ఎలా సహకరించాలో సలహాలు ఇస్తుంటుంది రేఖ. సినిమాయే శ్వాసగా జీవిస్తున్న నటీమణుల్లో రేఖ కూడా ఒకరు. ఆమె సిన్సియారిటీ నేటితరం హీరోయిన్లకు ఆదర్శం. ‘రేఖతో కలిసి నటించే ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నా. సెట్స్‌లో ఆమెను ఎప్పుడు కలుస్తానా? అని ఎగ్జయిటింగ్‌గా ఉంది. తెరపై ఇద్దరి కాంబినేషన్‌లో సీన్స్‌ చూసుకోవాలని పరితపిస్తున్నా’ అని కత్రినాకైఫ్‌, రేఖతో నటించడం పట్ల ఎగ్జయిట్‌మెంట్‌ని ప్రదర్శించింది. ఇదివరకు కొన్ని సందర్భాల్లో రేఖను కలిసిన కత్రినాకైఫ్‌, ఆమె నుంచి నటనలో కొన్ని టిప్స్‌ తెలుసుకుందట.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam