నా జ్ఞాపకల్లోంచి - డా.కె.ఎల్ .వి.ప్రసాద్ , హనంకొండ

అలవాటు _పొరపాటు ..!!*


లోకంలో భిన్నరుచులు గల వ్యక్తులు మనకు ,మన జీవితకాలంలో ,ఎదురు పడుతూ ఉంటారు .అలాగే భిన్నమయిన వ్యక్తిత్వాలు గల మనుష్యులు తారస పడుతుంటారు .అందరి మనసులు ఒకేలా ఉండవు అలాగే ,అందరి ఆలోచనలను ఒకేలా ఊహించలేము అలా ఉంటే ప్రపంచం /దేశం /రాష్ట్రం /మన ఊరు ఇలావుండవు .ఒకేఆలోచన ,ఒకే అభిరుచి ,ఒకే ద్యేయం ఉంటే ,యావత్ ప్రపంచమూ స్వరం ... యుగంలో , ఆనంద /,ఆరోగ్య ,జీవితం గడుపుతున్నట్టే ! మరి ప్రస్తుత మన జీవన విధానం లో ,ఇది సాద్య పడుతున్నదా ?అని,మనకు మనం  ప్రశ్నించుకుంటే ,'లేదు ' అని ,తప్పక సమాధానం వస్తుంది.కారణం,భిన్న రుచులు ,భిన్నమయిన ఆలోచనా ధోరణులు . మనలోని అలవాట్లు ,మనిషి _మనిషికి తేడా కనిపిస్తాయి.అలాగే ,ఎవరి అలవాట్లు ,వాళ్లకి మంచిగ అనిపిస్తాయి .మన అలవాట్లు ,ఎదుటివాళ్ళకు నచ్చాలనే నియమం లేదు ,అందుకే కొన్ని అలవాట్లు ముందువెనుక చూడకుండా ,ప్రయోగిస్తే  ,అవి ఒక్కొసారి ,మనకి ,ఎదుటి వాళ్లకి కూడా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది . అలవాట్లు ,ఒక్కొక్కరికీ ,ఒక్కో రకంగా అబ్బుతాయి.పుట్టుకతోనే వచ్చేవి కొన్ని (జన్యు ప్రధానమైనవి ) తల్లిదండ్రులనించి ,దగ్గర బంధువుల నుంచి ప్రాప్టించేవి కొన్ని ,పనిగట్టుకుని నేర్పించేవి కొన్ని, ఎదుటివాళ్లను చూసి నేర్చుకునేవి మరికొన్ని ! అలవాట్లు మంచివైనంతవరకూ ఎలాంటి సమస్యలూ దరికీ రావు గానీ, అవి చెడు అలవాట్లు అయినప్పుడే  అసలయిన ఇబ్బందులు ఎదురవుతాయి .కుటుంబాలలో ,బందు వర్గాల మద్య లేని పోని కలతలు మొదలవుతాయి ,కొందరి జీవితాలే కూలిపోతాయ్ .కొందరు ," మా అబ్బాయి చాల మంచివాడు ...కానీ ,ఫలానా వ్యక్తి చేసిన అలవాట్ల వల్ల మా వాడు ఇలా అయిపోయాడు "అని వాపోతూ ,నింద మరొకరిమీద నెట్టివేసే ప్రయత్నం చూస్తుంటారు !ఈ నింద ,ఏమాత్రమూ సబబు కాదు ఇలా కాకుండా ,కొన్ని మంచి అలవాట్లే .. రూటు మారి ,ఇబ్బందులు కలిగిస్తాయి .అలా జరుగుతుందని మనం ఊహించలేము .సంఘటన జరిగిన తరువాత ,ఆశ్చర్యము ,భయము ,బాధ కూడా కలుగుతాయి ఎదుటి వాళ్లు ,మంచివాళ్ళు అర్థం చేసుకోగలవాళ్ళు ,సంస్కారవంతులు అయితే ఫరవాలేదు కానీ ,మరో రకం అయితే ,అక్కడ రణ రంగమే సృష్టింప బడుతుంది . అంతెందుకు ,నా జీవన యానంలో ని ,గొప్ప ...అనుభవాన్ని ,మీ ముందుంచుతాను .      

*********

అత్యంత క్లిష్టమయిన నాబాల్య దశ ,పెద్దన్నయ్య స్వర్గీయ కె .కె .మీనన్ దగ్గర గడిచింది.మా బంధువుల్లో అప్పటి కి ,అన్నయ్య ఒక్కడే హైదరబాద్ లో ఉండేవాడు .బంధు /స్నేహ వర్గం ఎవరయినా ,ఏదో పనిమీద వస్తూ ,అన్నయ్య ఇంట్లొ దిగేవారు.అప్పట్లో ..ఆ ..రెండు గదుల అద్దె ఇల్లు ఎందరెందరికో ,ఆశ్రయం ఇస్తుండేది.అన్నయ్య , సహృదయత ,స్నేహ శీలత ,వచ్చిన వారిని ,అచ్చెరువు పొందేలా చేసేది .స్వంత ఖర్చులతో,వాళ్ల పనులు చేసిపెట్టడమే గాక, హైదరాబాదు లోని ,దర్శనీయ స్థలాలకు తీసుకు పోయేవాడు.ప్రతి సారీ ..ఆ గుంపులో నేనూ .. ఉండేవాడిని. నా ..డిగ్రీ అయిపోయిన సమయంలో ,నేనూ ..ఒక బృందాన్ని అలా చూడ దగ్గ ప్రదేశాలను చూపించాల్సి వచ్చింది.ఆ .నేపథ్యంలో ....ఒక రోజు ..నెహ్రు జూలాజికల్ పార్క్ కు వెళ్ళవలసి వచ్చింది.ప్రవేశ అనుమతి టికెట్లు కొనుక్కుని లోపలికి ప్రవేశించి ముందుకు సాగుతున్నాం. మా బృందం లో షుమారుగా అయిదుగురం సభ్యులం ఉండి ఉంటాం .జట్టుగా కలసి వెళుతున్నాం కొద్ది దూరం పోయాక ...అర ఫర్లాన్గ్ దూరం లో .. మా లాంటి బృందమే ఒకటి జట్టుగా కలిసి వెళ్తున్నారు.వాళ్ల వెనుక భాగాలే మాకు కనిపిస్తున్నాయ్.అందులొ ఒకతను నా క్లోజ్ .. ఫ్రెండ్ లా కనిపించాడు.నడకను బట్టి 'అతడే 'అని, నిర్దారణ జరిగాక ,అతనిని సర్ప్రైజ్ చేయాలనుకున్నాను.నాకు ఇష్టమయిన వాళ్లని ,
వీపు మీద చరిచి పలకరించడం నాకు బాగ .. అలవాటు.ఇందులో ఆడ /మగ ,తేడా లేదు. నానడకలో స్పీడు పెంచి ,అతని వెనుకగా వెళ్లి అతని వీపుమీద ,గట్టిగా చరిచాను.అతను క్షణం ఆశ్చర్యానికి లోనై,వెనక్కి తిరిగి సీరియస్ గా ..నా ..ముఖంలో ముఖం పెట్టి  చూస్తున్నాడు. నాకు షాక్ అయినంత పని అయింది.సిగ్గుతొ తల దించుకున్నాను.క్షణం పాటు నొరు కదపలేక పొయాను.తరువాత వంద సార్లైనా 'సారీ ...' చెప్పి వుంటాను.అతను మంచి మనస్సుతో నన్ను .. క్షమించి వదిలేసాడు. నేను కూడా ..వెనక నుండి వీఁపు చరచడం అనే .. అలవాటును  తగ్గించుకున్నాను.ఆ..రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ,వళ్ళు జలధరిస్తుంటుంది . 

డా.ఎల్ .వి.ప్రసాద్ .కానేటి .
హనంకొండ 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు